స్విస్‌ ఇండోర్‌ ఛాంపియన్‌షిప్‌ గెలిచిన రోజర్‌ ఫెదరర్‌

2019 Latest Sport News, 2019 Latest Sport News And Headlines, Basel Roger Federer Wins His 10th Basel Title At Swiss, Federer wins 10th Swiss Open Crown, latest sports news, latest sports news 2019, Mango News Telugu, Roger Federer cruises to 10th Swiss Indoors title in Basel, Roger Federer Wins 10th Swiss, Roger Federer Wins 10th Swiss Open Crown, Roger Federer Wins 10th Swiss Open Title, sports news, Swiss Indoors 2019

టెన్నిస్ దిగ్గజం, స్విట్జర్లాండ్ ఆటగాడు రోజర్‌ ఫెదరర్‌ మరో సింగిల్స్ టైటిల్ సాధించాడు. ఆదివారం తన హోమ్ టౌన్ అయిన బాసెల్‌ వేదికగా జరిగిన స్విస్‌ ఇండోర్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఆటగాడు అలెక్స్‌ డి మినార్‌పై 6-2, 6-2 తేడాతో విజయం సాధించాడు. టాప్ సీడ్ ఫెదరర్ తన కెరీర్‌లో పదోసారి స్విస్ ఓపెన్ సాధించిన ఘనత అందుకున్నాడు. ఈ విజయంతో కెరీర్‌లో మొత్తం 103 సింగిల్స్‌ సాధించి, 109 సింగిల్స్ టైటిల్స్‌తో జిమ్మీ కానర్స్ పేరు మీదున్న రికార్డ్ కు మరి కొంచెం చేరువయ్యాడు. ఈ సీజన్లో రోజర్‌ ఫెదరర్‌ నాలుగు టైటిల్స్ గెలుచుకున్నాడు. దుబాయ్‌ ఓపెన్ , మియామి, హాలే టైటిల్స్‌, స్విస్ ఓపెన్ లలో అద్భుత ప్రదర్శన కనబరిచి టైటిల్స్ సాధించాడు. మ్యాచ్ అనంతరం రోజర్‌ ఫెదరర్‌ మీడియాతో మాట్లాడుతూ, తన ఆట పట్ల సంతోషం వ్యక్తం చేశాడు. ఇలాగే అత్యుత్తమంగా తన ప్రదర్శనను కొనసాగిస్తానని, ప్రత్యర్థి అలెక్స్ సైతం ఈ టోర్నమెంటులో అద్భుతంగా రాణించినట్టు తెలిపాడు. తన స్వస్థలమైన బాసెల్ లో పదోసారి టైటిల్ గెలవడం ప్రత్యేకంగా ఉందని ఫెదరర్ పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 + 7 =