ఇన్‌స్టాగ్రామ్‌లో విరాట్ కోహ్లీదే హవా

Mango News, The Sole cricketer in Instagram Rich list for 2019, Virat Kohli ahead of Conor McGregor in Instagram, Virat Kohli Ahead Of Mohamed Salah, Virat Kohli features in the top 10 Instagram sports, Virat Kohli is the only cricketer in the world to feature in Instagram, Virat Kohli Only Cricketer in Instagram Highest Paid Athletes List, Virat Kohli Only Cricketer In Instagram Sports Rich List 2019

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ అతి తక్కువ కాలంలోనే క్రికెట్ లో అనేక రికార్డులు సృష్టించాడు, అంతే కాకుండా అనేక వ్యాపార సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటున్నాడు. బ్రాండింగ్ లో కూడ భారత క్రికెటర్లలో టాప్ లో కొనసాగుతున్నాడు. బ్రాండ్ల ద్వారా అత్యధిక ఆదాయం సంపాదించే ఆటగాడిగా నిలుస్తున్నాడు. సోషల్ మీడియా మాధ్యమాలైన ఇన్‌స్టాగ్రామ్‌, ట్విట్టర్, పేస్ బుక్ లలో కోహ్లీకి కోట్లలో ఫాలోయర్స్ ఉన్నారు. కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్‌ని 38.1 మిలియన్ మంది ఫాలో అవుతున్నారు. తాను బ్రాండ్అంబాసిడర్ గా వ్యవహరించే ఉత్పత్తులకు కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టులు పెడుతుంటాడు. అయితే ఇలా చేసినందుకు కోహ్లీ ఒక్కో పోస్టుకు రూ 1.35 కోట్లు తీసుకుంటున్నాడని సమాచారం.

ఇటీవలే హోపర్‌హెచ్‌క్యూ అనే ఇన్‌స్టాగ్రామ్‌ షెడ్యూలింగ్ టూల్ విడుదల చేసిన జాబితాలో ప్రపంచ వ్యాప్తంగా కోహ్లీ తొమ్మిదవ స్థానంలో ఉన్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అత్యధిక ఆదాయం సంపాదిస్తున్న క్రికెటర్ గా కోహ్లీ వార్తల్లో నిలిచాడు. హోపర్‌హెచ్‌క్యూ అనే సంస్థ విడుదల చేసిన టాప్ 10 జాబితాలో మరే ఇతర క్రికెటర్ లేడు. మొదటి స్థానంలో పోర్చుగల్ ఫుట్ బాల్ ప్లేయర్ క్రిస్టియానో రోనాల్డో ఉన్నాడు, ఆటను ఒక్కో పోస్టుకు రూ 6.73 కోట్లు తీసుకుంటున్నాడు. తరువాత స్థానాల్లో నెయ్ మార్, మెస్సి ఇతర ఫుట్ బాల్ ఆటగాళ్లు ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 + two =