భారత-ఎ జట్టును అభినందించిన బీసీసీఐ

BCCI congratulates India A for winning one-day series vs Windies A, BCCI Congratulates India-A Team For Winning ODI Series Against West Indies-A, India Vs West Indies Match Highlights, Latest Cricket News, Mango News

భారత-ఎ జట్టు క్రికెట్ క్రీడాకారులకు బీసీసీఐ అభినందనలు తెలిపింది. అంటిగ్వా లో అనధికారికంగా వెస్టిండీస్-ఎ జట్టుతో జరిగిన వన్డే సిరీస్ లో 4-1 తో భారత-ఎ జట్టు ఘన విజయాన్ని కైవసం చేసుకోవడంతో బీసీసీఐ,జట్టు ప్రదర్శన పై ఆనందాన్ని వ్యక్తం చేసింది. భారత-ఎ జట్టు ఐదు మ్యాచ్ ల వన్డే సిరీస్ కైవసం చేసుకోవడంతో ట్విట్టర్లో బీసీసీఐ అధికారిక అకౌంట్ నుండి జరిగిన ఐదు మ్యాచ్ ల ఫలితాలను పోస్ట్ చేసింది. భారత-ఎ జట్టు మొదటి మూడు వన్డే మ్యాచ్ లు గెలిచింది, నాలుగవ వన్డేలో ఐదు పరుగుల తేడాతో ఓడిపోయింది, తిరిగి మళ్ళీ ఐదవ వన్డే లో ఘన విజయం సాధించింది.

ఈ సిరీస్ లో భారత ఆటగాడు శుభమన్ గిల్ అద్భుతమైన ప్రదర్శన తో ఆకట్టుకున్నాడు, సిరీస్ లో రాణించి ప్లేయర్ అఫ్ ది సిరీస్ అవార్డు కైవసం చేసుకున్నాడు. ఈ విజయం సందర్భంగా శుభమన్ గిల్ కూడ ట్విట్టర్లో తన ఆనందాన్ని పంచుకున్నాడు. అవార్డు అందుకోవడం ఆనందంగా ఉందని, భారత్ జట్టుకు ఆడదాన్ని ఎల్లప్పుడూ గర్వంగా భావిస్తానని చెప్పాడు. ఈ సిరీస్ లో క్రునాల్ పాండ్యా, నవదీప్ సైని బౌలింగ్ లో రాణించారు. నవదీప్ సైని ఈ వన్డే సిరీస్ లో అత్యధిక వికెట్లు సాధించి, ఆగస్ట్ 3 నుంచి వెస్టిండీస్ తో తలపడే భారత జట్టులో చోటు సంపాదించాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here