క్షేమంగా ఇంటికి చేరిన జషిత్

4 Years Old Boy Jashit Came Home Safely After Missing, Finally Jashit Back To Home, Kidnapped Jashith Reached Home Safely, Mandapeta Boy Jashit Safely Reached To Home, Mandapeta Boy Missing Case Latest News, Mango News, Progress In Mandapeta 4 Years Old Boy Kidnap Case

తూర్పు గోదావరి జిల్లాలోని మండపేట మండలంలోని విజయలక్ష్మీ నగర్లో జూలై 22 న అపహరణకు గురైన బాలుడు జషిత్ ను పోలీసులు కనుగొన్నారు. మూడురోజుల ఉత్కంఠ తరువాత తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ నయీమ్,జషిత్ ను తల్లిదండ్రుల చెంతకు చేర్చడంతో అందరూ ఆనందం వ్యక్తంచేసారు.ఎస్పీ నయీమ్ మాట్లాడుతూ, కిడ్నాపర్లు జషిత్‌ను కుతుకులూరు వద్ద విడిచిపెట్టారని,అక్కడ గ్రామస్తులు అతన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో, పోలీసులు వెంటనే ఆ స్థలానికి చేరుకుని జషిత్ ను తీసుకొచ్చారని, జషిత్ పూర్తీ ఆరోగ్యంతోనే ఉన్నాడని తెలిపారు.

మండపేట పోలీసులు ఈ కేసు యొక్క అన్ని కోణాలను విశ్లేషించడానికి ప్రయత్నిస్తున్నారు, కిడ్నాపర్లను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు. కుతుకులూరు గ్రామస్తుల నుండి వారికి కాల్ వచ్చేవరకు, బాలుడు ఆ గ్రామంలోనే ఉన్నాడు,వ్యక్తిగత కారణాల వలనే జషిత్‌ను అపహరించి ఉంటారని భావిస్తుండడంతో, ఆ దిశగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. తన కిడ్నాపర్ల గురించి జషిత్‌ను అడిగినప్పుడు, కిడ్నాపర్లలో ఒకరికి తనకు తెలుసు, అతని పేరు రాజు అని జషిత్ చెప్పాడు. సంచలనం సృష్టించిన జషిత్ కిడ్నాప్ కేసు సుఖాంతం అయ్యి, జషిత్ ఇంటికి చేరుకోవడంతో కుటుంబ సభ్యులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.

 

[subscribe]
[youtube_video videoid=Nc9nCuglB7I]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × five =