దర్శకుడు రాజమౌళికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ

Director SS Rajamouli, Director SS Rajamouli Tested Positive, Rajamouli, Rajamouli Tested Positive, SS Rajamouli, SS Rajamouli Tested Positive for Covid-19, SS Rajamouli Upcoming Movie News

కరోనావ్యాప్తి రోజురోజుకి పెరుగుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలువురు ప్రజాప్రతినిధులు, సినీ ప్రముఖులు, పలు రంగాల కీలక వ్యక్తులు సైతం కరోనా వైరస్ బారిన పడుతున్నారు. ఈ క్రమంలో ప్రముఖ సినీ దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి కి కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ లో వెల్లడించారు. తన కుటుంబ సభ్యులకు, తనకు కొద్ది రోజుల క్రితం కొంచెం జ్వరం వచ్చి తగ్గిపోయిందని, అయితే ముందు జాగ్రత్తగా కరోనా పరీక్షలు చేయించుకున్నట్టు తెలిపారు. ఫలితం మైల్డ్ కోవిడ్ పాజిటివ్ గా వచ్చిందని, వైద్యులు సూచించిన విధంగా హోమ్ క్వారంటైన్ లో ఉన్నట్టు చెప్పారు. వారిలో ఎవరికీ కరోనా లక్షణాలు లేనప్పటికీ, అన్ని నిబంధనలు పాటిస్తున్నామని దర్శకుడు రాజమౌళి తెలిపారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 4 =