గొర్రెకుంట తొమ్మిది హత్యల కేసులో నిందితుడు సంజ‌య్‌ కుమార్ కు ఉరిశిక్ష

9 Murders Case Updates, Death penalty for murderer of nine people, Death Sentence for Convict Sanjay Kumar, Death sentence for man convicted for killing 9 migrants, Gorrekunta 9 Murders Case, Gorrekunta 9 Murders Case News, Gorrekunta 9 Murders Case Updates, Gorrekunta Murders Case, Mystery of Warangal well of death, telangana, Warangal

తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్‌ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంటలో తొమ్మిది మందికి మత్తు ఇచ్చి, వారిని ఓ బావిలో పడేసి హత్య చేసిన ఘటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ముందుగా ఈ కేసులో వరంగల్‌ పోలీసులు సత్వర విచారణ చేపట్టి మిస్టరీని ఛేదించారు. బీహార్ కు చెందిన సంజయ్‌ కుమార్ యాదవ్ ను కీలక నిందితుడుగా గుర్తించారు. కాగా సంచలనం సృష్టించిన ఈ తొమ్మిది హత్యల కేసులో వ‌రంగ‌ల్ జిల్లా సెష‌న్స్ కోర్టు బుధ‌వారం నాడు తుదితీర్పు వెల్ల‌డించింది. ఒక హత్యను కప్పిపుచ్చుకునేందుకు తొమ్మిది మందిని బావిలో పడేసి హత్య చేసిన నిందితుడు సంజ‌య్ కుమార్ యాద‌వ్ ను దోషిగా తేల్చుతూ, ఉరిశిక్ష విధిస్తున్నట్టుగా కోర్టు తీర్పు వెల్లడించింది.

పోలీసులు బలమైన సాక్షాధారాలుతో ఛార్జ్ షీట్ నమోదు చేయడంతో ఘటన జరిగిన కొన్ని నెలల్లోనే ఈ కేసులో తుది తీర్పు వెలువడింది. ఈ కేసులో మొత్తం 67 మందిని జిల్లా సెష‌న్స్ కోర్టు న్యాయ‌మూర్తి విచారించారు. నిందితుడిపై నమోదైన అభియోగాలు నిరూపితం కావడంతో ఉరిశిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెల్లడించారు. నిందితుడు సంజయ్ కు ఉరిశిక్ష పడటం పట్ల పోలీసు అధికారులు, ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు: 
వరంగల్ తొమ్మిది హత్యల కేసులో సంచలన విషయాలు, మిస్టరీ ఛేదించిన పోలీసులు
వరంగల్ లో తొమ్మిది మంది మృతుల ఘటన, పకడ్బందీ దర్యాప్తుకు హోం మంత్రి ఆదేశాలు

 

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu