హుస్సేన్ సాగర్ నుండి మూసి వరకు నాలా పటిష్టత, అభివృద్దికి రూ.68.40 కోట్ల నిధులు

Hussain Sagar to Musi, Hussain Sagar to Musi Nala development, Hussainsagar, Nala development, Nala development from Hussain Sagar to Musi, telangana, Telangana Govt, Telangana Govt Allocates Rs 68.40 Crore Funds, Telangana News, Telangana Political News

హుస్సేన్ సాగర్ నుండి మూసి వరకు ఉన్న నాలా పటిష్టత, అభివృద్దికి రూ.68.40 కోట్ల నిధులతో పనులు చేపడుతున్నట్లు జిహెచ్ఎంసి మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. వరద బాదిత కుటుంబాలను పరామర్శించుటకు ఇటీవల గోల్నాక ప్రాంతంలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు పర్యటించారు. ఈ సందర్భంగా నల్లకుంట ఫీవర్ హాస్పిటల్ నుండి మూసి వరకు ఒక కిలోమీటర్ పొడవున మూసికి రిటైనింగ్ వాల్ నిర్మించి, ఈ ప్రాంతంలోని కాలనీల వరద ముంపు సమస్య పరిష్కరించనున్నట్లు మంత్రి కేటిఆర్ హామీ ఇచ్చారు.

తదనుగుణంగా మంత్రి కేటిఆర్ ఆదేశాల మేరకు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, జోనల్ కమిషనర్ బి.శ్రీనివాస్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్లు ముఠా పద్మ, జి.శ్రీదేవి, ఇరిగేషన్ అధికారులతో కలిసి నల్లకుంటలో మేయర్ బొంతు రామ్మోహన్ పర్యటించారు. వరద ముంపుకు గురవుతున్న కాలనీలలోని కుటుంబాలతో మేయర్ మాట్లాడారు. మంత్రి కేటిఆర్ ఆదేశాల మేరకు హుస్సేన్ సాగర్ నుండి ప్రస్తుతం ఉన్న 8 కిలోమీటర్ల నాలాను రిటైనింగ్ వాల్ ను పటిష్టపర్చనున్నట్లు తెలిపారు. అలాగే గోల్నాక నుండి మూసి వరకు కొత్తగా ఒక కిలోమీటరు పొడవున రిటైనింగ్ వాల్ ను నిర్మించనున్నట్లు తెలిపారు. ఈ పర్యటనలో నీటి పారుదల విభాగం రిటైర్డ్ ఎస్.ఇ. వై.శేఖర్ రెడ్డి, ఇ.ఇ రేణుక, ఎ.ఇ రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 − three =