సీఎం కేసీఆర్ తో జనతా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అమిత్ జోగీ భేటీ

Janata Congress Party President Amit Jogi Paid a Courtesy Call on CM KCR at Pragathi Bhavan,Janata Congress Party President,Congress Party President Amit Jogi,Amit Jogi Paid a Courtesy Call,CM KCR at Pragathi Bhavan,Mango News,Mango News Telugu,CM KCR News And Live Updates,Telangna Congress Party,Telangna BJP Party, YSRTP,TRS Party, BRS Party, Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుతో బుధవారం ప్రగతిభవన్ లో ఛత్తీస్ ఘఢ్ మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగీ తనయుడు, జనతా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అమిత్ జోగీ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. పార్టీ ముఖ్యనాయకులతో కలిసి సీఎం కేసీఆర్ తో పలు అంశాలపై అమిత్ జోగీ సుధీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా తెలంగాణ అభివృద్ధి, దేశంలోని రాజకీయ పరిణామాలు, జాతీయ వ్యవహారాలపై లోతుగా చర్చించారు. అలాగే బీఆర్ఎస్ పార్టీ జాతీయ పార్టీ విధి విధానాలను సీఎం కేసీఆర్ ను అమిత్ జోగీ ఆసక్తితో అడిగి తెలుసుకున్నారు. జాతీయ రాజకీయాల్లో ప్రత్యామ్న్యాయ రాజకీయ శక్తుల అవసరం వున్నదని అభిప్రాయపడిన అమిత్ జోగి, బీఆర్ఎస్ జాతీయ పార్టీని స్థాపించడాన్ని ఆహ్వానించారు.

అలాగే అనతి కాలంలోనే తెలంగాణ రాష్ట్ర పాలనను దేశానికి ఆదర్శంగా నిలిపారని, సంక్షేమం అభివృద్ధి రంగాల్లో దేశంలో ముందు వరసలో తెలంగాణను నిలిపేందుకు కృషి చేసారని సీఎం కేసీఆర్ ను అమిత్ జోగీ అభినందించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కు అమిత్ జోగీ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం తన తండ్రి ఛత్తీస్ ఘఢ్ మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగీ తన గురించి రాసుకున్న ఆటోబయోగ్రఫీని సీఎం కేసీఆర్ కి బహూకరించారు. కాగా ప్రస్తుతం జనతా కాంగ్రేస్ పార్టీకి ముగ్గురు ఎమ్మెల్యేలున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here