వాస్తవాల వక్రీకరణ, రాజకీయ ప్రత్యర్థులపై దాడి కోణంలో శ్వేతపత్రం: హరీష్ రావు

White Paper On Distortion Of Facts Attack On Political Opponents Says Harish Rao, White Paper On Distortion Of Facts Harish Rao, Harish Rao Facts Attack On Political Opponents, Facts Attack On Political Opponents Says Harish Rao, White Paper On Distortion Of Facts Attack, White Paper On Distortion Of Facts, Harish Rao, Telangana Assembly, BRS, Swetha Patram, Batti Vikramarka, Swetha Patram Released, Latest Asembly News, Asembly News, Telangana Asembly News, Asembly, Mango News, Mango News
Harish rao, Telangana assembly, BRS, Swetha patram, Batti Vikramarka

తెలంగాణ అసెంబ్లీ ఐదవ రోజు వాడివేడిగా కొనసాగింది. ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సభలో శ్వేతపత్రం విడుదల చేశారు. రాష్ట్ర అప్పు రూ. 6,71,757 కోట్లుగా ఉందని శ్వేత పత్రంలో పేర్కొన్నారు. అయితే ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రంపై ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ భగ్గుమంటోంది. గత ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టాలనే ధోరణితో శ్వేతపత్రాన్ని విడుదల చేశారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు. శ్వేతపత్రం పూర్తిగా తప్పుల తడకగా ఉందని విమర్శించారు.

శ్వేతపత్రం ప్రజలు, ప్రగతి కోణంలో లేదని.. వాస్తవాల వక్రీకరణ, రాజకీయ ప్రత్యర్థులపై దాడి కోణంలో ఉందని ఉందని అన్నారు. కాంగ్రెస్ సర్కార్ విడుదల చేసిన శ్వేతపత్రాన్ని తెలంగాణ అధికారులు విడుదల చేయలేదన్న  హరీష్ రావు.. సస్పెండ్ అయిన ఆంధ్రా అధికారులు తయారు చేశారని ఆరోపించారు. అప్పులు, జీఎస్‌డీపీ నిష్పత్తిని ప్రగతికి కొలమానంగా తీసుకుంటారని.. వాటిని నివేదికలో చూపించలేదని అన్నారు. అప్పులు తీసుకున్న రాష్ట్రాల్లో తెలంగాణ కింది నుంచి ఐదవ స్థానంలో ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పిందని వెల్లడించారు.

కర్ణాటక, రాజస్థాన్ రాష్ట్రాలు తెలంగాణ కంటే ఎక్కువగా అప్పులు తీసుకున్నాయని వివరించారు. తమ ప్రభుత్వం భవిష్యత్ తరాల కోసం ఆస్తుల కల్పనకు ప్రధాన్యత ఇచ్చిందని చెప్పారు. అప్పులు తీసుకొచ్చి ఎక్కడా అవినీతి జరగకుండా రాష్ట్రంలో అస్తులు సృష్టించామని వివరించారు. అప్పు తీసుకొచ్చిన ప్రతీ పైసాను భవిష్యత్ అవసరాల కోసమే ఖర్చు చేశామని తెలిపారు. సొంత ఆదాయ వనరుల వృద్ధిలో తెలంగాణను దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిపామన్నారు. గత 9 ఏళ్లలో రూ. 3.36 లక్షల కోట్ల మూలధన వ్యయం జరిగిందన్న హరీష్ రావు దీనిని శ్వేత పత్రంలో ఎక్కడా చూపించలేదని మండిపడ్డారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × five =