ఏఐసీసీ ఇచ్చిన షోకాజ్ నోటీసులు ఎప్పుడో చెత్త బుట్టలో పడ్డాయి – ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

MP Komatireddy Venkat Reddy Interesting Comments After Meets Telangana Congress Incharge Manikrao Thakre,MP Komatireddy Venkat Reddy,Venkat Reddy Interesting Comments,Telangana Congress Incharge,Manikrao Thakre,Mango News,Mango News Telugu,Telangana CS Santhi Kumari,CS Santhi Kumari Meets CM KCR,CM KCR News And Live Updates, Telangna Congress Party, Telangna BJP Party, YSRTP,TRS Party, BRS Party, Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates

ఏఐసీసీ క్రమశిక్షణ సంఘం తనకు ఇచ్చిన షోకాజ్ నోటీసులు ఎప్పుడో చెత్త బుట్టలో పడ్డాయని అన్నారు తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. గురువారం ఆయన తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహరాల నూతన ఇన్‌చార్జ్‌ మాణిక్ రావు ఠాక్రేతో సమావేశమయ్యారు. హైదరాబాద్‌లోని హైదర్‌గూడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన ఈరోజు ఠాక్రేతో భేటీ అయ్యారు. ఈ మేరకు ఎంపీ కోమటిరెడ్డి దీనిని గురించి తన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ‘ఎమ్మెల్యే క్వార్టర్స్ లో తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జ్‌ మాణిక్ రావు ఠాక్రే గారిని కలిశాను. ఇన్‌చార్జ్‌ పదవి చేపట్టాక తొలిసారి రాష్ట్రానికి వచ్చిన ఆయనను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు చెప్పాను. ఈ సందర్భంగా పార్టీ పరిస్థితులపై ఠాక్రేతో చర్చించాను’ అని అందులో ఎంపీ వెంకట్ రెడ్డి పేర్కొన్నారు.

ఇక ఈ భేటీ అనంతరం ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మీడియాతో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బుధవారం గాంధీభవన్‌కు ఎందుకు రాలేదని తనను అడుగుతున్నారని, మరి ఇతర ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి, పొడెం వీరయ్య, సీతక్కలు కూడా రాలేదని, వారు ఎందుకు మాణిక్ రావు ఠాక్రేను కలవలేదని ప్రశ్నించారు. అలాగే తమకు సంబంధించిన కొన్ని ఫొటోలు మార్ఫింగ్‌ చేసిన విషయాన్ని ఏఐసీసీ దృష్టికి తీసుకెళ్లానని, సీపీయే స్వయంగా అవి మార్ఫింగ్‌ ఫొటోలని స్పష్టం చేశారని తెలిపారు. ఇక పీసీసీ కమిటీలను తాను అసలు పట్టించుకోనని, నాలుగైదుసార్లు ఓడినోళ్లతో నేను కూర్చోవాలా? అని ఆయన మండిపడ్డారు.

కాగా తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర వ్యహరాల ఇన్‌చార్జ్‌గా బాధ్యతలు చేపట్టాక మాణిక్ రావు ఠాక్రే తొలిసారి బుధవారం హైదరాబాద్‌కు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన పార్టీ నేతలతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. నిన్న అర్ధరాత్రి వరకు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్లతో సమావేశాలు నిర్వహించిన ఆయన ఈరోజు కూడా పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహిస్తునున్నారు. ఈ క్రమంలోనే నేడు ఎంపీ కోమటిరెడ్డి ఠాక్రేను కలిశారు. దాదాపు గంటన్నరపాటు సాగిన వీరి సమావేశంలో.. రాష్ట్రంలో పార్టీ పరిస్థితులు, గతేడాది చివరిలో ప్రకటించిన పీసీసీ కమిటీల నియామకం వ్యవహారంలో ఏర్పడిన గందరగోళ పరిస్థితులు, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీరుపై సీనియర్ల అసంతృప్తి తదితర అంశాలపై ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఠాక్రేకు వివరించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here