నేడు హైదరాబాద్‌కు వస్తున్న ప్రధాని మోదీ, నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు.. పర్యటన షెడ్యూల్‌ ఇదే

PM Modi To Visit Hyderabad Being a Part of 20th ISB Anniversary Today, Hyderabad Police Made Elaborate Arrangements Amid PM Modi Hyderabad Visit On May 26, PM Modi Hyderabad Visit On May 26, Hyderabad Police Made Elaborate Arrangements For PM Modi Hyderabad Visit, PM Modi will Visit Hyderabad on May 26 to Participate in Annual Day Celebrations of ISB, PM Narendra Modi will Visit Hyderabad on May 26 to Participate in Annual Day Celebrations of ISB, PM Modi will Visit Hyderabad on May 26, PM Modi to Participate in Annual Day Celebrations of ISB, Annual Day Celebrations of ISB, ISB Annual Day Celebrations, PM Modi Hyderabad Tour, PM Modi One Day Hyderabad Tour, PM Modi Hyderabad Tour News, PM Modi Hyderabad Tour Latest News, PM Modi Hyderabad Tour Latest Updates, PM Modi Hyderabad Tour Updates, Indian School of Business annual day, Indian School of Business Annual Day Celebrations, Indian School of Business, PM Narendra Modi, Narendra Modi, Prime Minister Narendra Modi, Prime Minister Of India, Narendra Modi Prime Minister Of India, Prime Minister Of India Narendra Modi, Hyderabad Police, Mango News, Mango News Telugu,

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బి) 20వ వార్షికోత్సవ వేడుకలు మరియు 2022 పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ క్లాస్ గ్రాడ్యుయేషన్ వేడుకల్లో పాల్గొనేందుకు హైదరాబాద్‌ పర్యటనకు విచ్చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించడంతో పాటు, పలువురు విద్యార్థులకు పట్టాలు అందజేస్తారు. ప్రధాని మోదీ గురువారం మధ్యాహ్నం 1.25 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. ఐఎస్‌బీ వార్షికోత్సవం, స్నాతకోత్సవంలో పాల్గొన్న అనంతరం తిరిగి బేగంపేటకు చేరుకుని 3.55 గంటలకు ప్రత్యేక విమానంలో చెన్నైకి వెళ్తారు. ఈ సందర్భంగా నగరంలో పోలీసులు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. గచ్చిబౌలిలోని ఐటీ కారిడార్‌లో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిబంధనలు అమలులో ఉంటాయని, వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని అధికారులు సూచించారు. కాగా ప్రధాని పర్యటనకు సుమారు 1,500 మంది పోలీసులతో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు.

ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన షెడ్యూల్‌
  • 1:25 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు.
  • యిర్‌పోర్టులో గవర్నర్‌ తమిళిసై, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, మంత్రి తలసాని, సీఎస్, డీజీపీ, మేయర్‌తో పాటు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ స్వాగతం పలుకుతారు.
  • 1:50 గంటలకు బేగంపేట నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో హెచ్‌సీయూ క్యాంపస్‌లో దిగుతారు.
  • 2 గంటలకు అక్కడి నుంచి ప్రత్యేక వాహనంలో ఐఎస్‌బీకి చేరుకుంటారు.
  • 3:15 గంటల వరకు ఐఎస్‌బీ వార్షికోత్సవం, స్నాతకోత్సవంలో పాల్గొని ప్రసంగిస్తారు.
  • 3:20 గంటలకు ఐఎస్‌బీ నుంచి బయలుదేరి 3:30కు తిరిగి హెచ్‌సీయూకు వస్తారు.
  • 3:50 గంటలకు బేగంపేటకు చేరుకొని 3:55 గంటలకు విమానంలో చెన్నైకి పయనమవుతారు.
వాహనదారులకు ట్రాఫిక్‌ డైవర్షన్‌ ఇలా..
  • గచ్చిబౌలి నుంచి లింగంపల్లి వైపు వెళ్లే వాహనదారులు – బొటానికల్ గార్డెన్, కొండాపూర్ ఏరియా దవాఖాన, మజీద్ బండ కమాన్, హెచ్​సీయూ డిపో రోడ్ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది.
  • విప్రో జంక్షన్ నుంచి లింగంపల్లి వైపు వెళ్లేవారు – క్యూ సిటీ, గౌలిదొడ్డి, గోపన్‌పల్లి క్రాస్‌రోడ్, హెచ్‌సీయూ బ్యాక్ గేట్, నల్లగండ్ల మీదుగా వెళ్లాల్సి ఉంటుంది.
  • విప్రో జంక్షన్ నుంచి గచ్చిబౌలి వైపు వెళ్లేవారు ఫెయిర్ ఫీల్డ్ హోటల్​, నానక్​రాంగూడ రోటరీ, ఓఆర్ఆర్ రోడ్, ఎల్ అండ్ టీ టవర్స్ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది.
  • కేబుల్ బ్రిడ్జి నుంచి గచ్చిబౌలి జంక్షన్ వైపు వెళ్లే వాహనాలు – జూబ్లీహిల్స్ రోడ్డు నం.45, మాదాపూర్ పీఎస్, సైబర్ టవర్స్, హైటెక్స్, కొత్తగూడ, బొటానికల్ గార్డెన్, గచ్చిబౌలి జంక్షన్‌ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × four =