జీవో 317ను సవరించాలి, గవర్నర్ కు వినతి పత్రం ఇచ్చిన తెలంగాణ బీజేపీ ప్రతినిధి బృందం

Governor Tamilisai Soundararajan, Mango News, Mango News Telugu, Tamilisai Soundararajan, Telangana BJP, Telangana BJP delegation meets Governor Tamilisai, Telangana BJP Representative Team Meets Governor, Telangana BJP Representative Team Meets Governor over transfers, Telangana BJP Representative Team Meets Governor Tamilisai, Telangana BJP Representative Team Meets Governor Tamilisai Soundararajan, Telangana BJP Representative Team Meets Governor Tamilisai Soundararajan Today

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రాజాసింగ్, రఘునందన్ రావు సహా పలువురితో కూడిన రాష్ట్ర బీజేపీ ప్రతినిధి బృందం శుక్రవారం నాడు రాజ్ భవన్ లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ను కలిసింది. ఈ సందర్భంగా రాష్ట్రపతి ఉత్తర్వుల స్ఫూర్తికి విరుద్ధమైన ఉద్యోగుల బదిలీల ప్రక్రియను తక్షణమే నిలిపేవేయాలని బీజేపీ బృందం గవర్నర్ ను కోరింది. అలాగే 317 జీవోను కూడా తక్షణమే సవరించాలని వినతి పత్రం అందజేశారు.

అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో తాజా బదిలీల ప్రక్రియ వలన ఉపాధ్యాయులు, వాళ్ళ కుటుంబాలు ఏ విధంగా బాధపడుతున్నాయో గవర్నర్ కు వివరించామని చెప్పారు. 317 జీవోను సవరించడంపై ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని కోరినట్టు తెలిపారు. తక్షణమే ఉద్యోగ, ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియను నిలిపివేస్తూ, స్థానికత ఆధారంగా బదిలీల ప్రక్రియ చేపట్టాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ