రేపటి నుండే హైదరాబాద్ లో సిటీ బస్సులు ప్రారంభం, ముందుగా 25 శాతం బస్సులకు అనుమతి

City Buses in Hyderabad, City Buses in Hyderabad Start, Hyderabad, Hyderabad buses start, Hyderabad City, Hyderabad City Buses, Hyderabad City buses to resume, Hyderabad RTC, KCR Gives Green Signal to Start City Buses in Hyderabad, RTC buses in hyderabad, TSRTC

కరోనా వ్యాప్తి నేపథ్యంలో మార్చిలో లాక్‌డౌన్ విధించినప్పటి నుంచి హైదరాబాద్ నగరంలో ఆర్టీసీ సిటీ బస్సుల సేవలు నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రేపటి నుంచి హైదరాబాద్‌లో సిటీ బస్సులు నడిపేందుకు టిఎస్ఆర్టీసీకి ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు అనుమతి ఇచ్చారు. ఈ అంశంపై రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తో సీఎం కేసీఆర్ ఈ రోజు ప్రత్యేకంగా చర్చించారు. నగరంలో సిటీ బస్సులు ప్రారంభించడంలో భాగంగా ముందుగా 25 శాతం బస్సులు నడిపేందుకు సీఎం అనుమతి ఇచ్చారు. పరిస్థితులను బట్టి దశలవారీగా బస్సుల సంఖ్య పెంచుకోవాలని సూచించారు. దీంతో దాదాపుగా ఆరు నెలల అనంతరం రేపు సిటీ బస్సులు రోడ్డెక్కనున్నాయి. 25 శాతం బస్సులు నడిపేందుకే అనుమతి ఉండడంతో ముందుగా అత్యంత రద్దీగా ఉండే మార్గాల్లో బస్సులు నడిపే అవకాశం ఉంది.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen + eight =