తెలంగాణ బీజేపీకి షాక్ ఇచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం.. సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా చేపట్టిన ప్రచారాన్ని ఆపాలని ఆదేశం

Telangana Central Election Commission Stops State BJP's Campaign Against CM KCR, Central Election Commission Stops State BJP's Campaign Against CM KCR, Telangana State BJP's Campaign Against CM KCR, Central Election Commission Stops State BJP's Campaign, Central Election Commission, Central Election Commission declines permission to BJP campaign against CM KCR, BJP campaign against CM KCR, CM KCR, BJP campaign News, BJP campaign Latest News, BJP campaign Latest Updates, BJP campaign Live Updates, Mango News, Mango News Telugu,

తెలంగాణ బీజేపీకి కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి, టిఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్‌)కు వ్యతిరేకంగా “సాలు దొర, సెలవు దొర” అనే ప్రచారాన్ని నిలిపివేయాలని భారత ఎన్నికల సంఘం (సీఈసీ) తెలంగాణ బిజెపి యూనిట్‌ను గురువారం ఆదేశించింది. బీజేపీ చేస్తున్న ఈ ప్రచారంపై అభ్యంతరం వ్యక్తం చేసిన సీఈసీ వెంటనే దీనిని ఆపేయాలని కోరింది. సీఎం కేసీఆర్‌ తెలంగాణలో అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తూ ఆయన ఫొటోలతో పోస్టర్లు ముద్రించేందుకు అనుమతి కోరగా సీఈసీ నిరాకరించింది. రాజకీయ పార్టీలకు చెందిన నేతలు ఎవరైనా సరే వారిని కించపరిచే విధంగా పోస్టర్లు, ఫోటోలు, రాతలు ఉండకూడదని స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే సాలు దొర-సెలవు దొర క్యాంపెయిన్‌కు మీడియా సర్టిఫికేషన్ కమిటీ అనుమతి నిరాకరించింది. కాగా గత కొద్దిరోజుల క్రితం బీజేపీ కార్యాలయం వెలుపల సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా కొన్ని ప్రకటనలు వెలిశాయి. ఇక ప్రధాని మోదీ పాల్గొన్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా కూడా హైదరాబాద్ నగరంలో ఈ ప్రకటనలతో బీజేపీ ప్రచారం చేసింది. కాగా సీఈసీ తాజా నిర్ణయం బీజేపీకి కొంత నిరుత్సాహాన్ని కలిగించేదే.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − two =