తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మంగళవారం ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి వెళ్లారు. సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఉత్తర్ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ సోమవారం ఉదయం కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం మధ్యాహ్నం సీఎం కేసీఆర్ హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ఉత్తరప్రదేశ్ చేరుకొని ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియలకు హాజరయ్యారు. ముందుగా సీఎం కేసీఆర్ యూపీలోని ఇటావా జిల్లాలోని ములాయం స్వగ్రామమైన సైఫయ్ కు వెళ్లి ములాయం సింగ్ యాదవ్ పార్థివ దేహానికి శ్రద్ధాంజలి ఘటించి నివాళులర్పించారు.
అలాగే ములాయం కుమారుడు, మాజీ యూపీ సీఎం అఖిలేశ్ యాదవ్ ను, ఆయన కుటుంబ సభ్యులను సీఎం కేసీఆర్ పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ములాయంకు నివాళులు అర్పించిన వారిలో సీఎం కేసీఆర్ తో పాటుగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీ కవిత, ఎంపీ సంతోష్ కుమార్, తదితరులు ఉన్నారు. అనంతరం యూపీ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో జరిగిన ములాయం అంత్యక్రియల్లో సీఎం పాల్గొన్నారు.
మరోవైపు సీఎం కేసీఆర్ యూపీ నుంచి నేరుగా ఢిల్లీకి చేరుకుంటారు. కొద్దీ రోజుల పాటుగా సీఎం కేసీఆర్ ఢిల్లీలోనే ఉండనున్నట్టు తెలుస్తుంది. ఇటీవలే తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీ పేరును భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీగా మార్చుతూ సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన పార్టీ సర్వసభ్య సమావేశంలో తీర్మానం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పేరుతో జాతీయపార్టీగా మారనున్న వేళ సీఎం కేసీఆర్ తొలిసారిగా ఢిల్లీలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఈసీ వద్ద బీఆర్ఎస్ రిజిస్ట్రేషన్ అంశంపై చర్చించడం సహా జాతీయ రాజకీయాలపై పలు పార్టీల నాయకులతో సీఎం కేసీఆర్ భేటీ కానున్నట్టు సమాచారం.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY