టీఎస్ పీజీ ఈసెట్‌-2022 నోటిఫికేషన్‌ విడుదల, దరఖాస్తు, పరీక్ష తేదీల వివరాలివే…

Telangana PGECET-2022 Notification Released, Telangana PGECET-2022, PGECET-2022 Notification Released, TS PGECET 2022 Application Dates, TS PGECET 2022 Exam Dates, 2022 TS PGECET, TS PGECET, TS PGECET notification 2022, TS PGECET 2022 exam date has been announced, 2022 TS PGECET exam dates, Telangana Post Graduate Engineering Common Entrance Test, Telangana Post Graduate Engineering Common Entrance Test exam date has been announced, Common Entrance Test, TELANGANA STATE COUNCIL OF HIGHER EDUCATION, Telangana State Level Common Entrance Test for Admission into Regular PG Courses, TSPGECET Exam 2022, PGECET Exam 2022, Telangana, PG Courses, Telangana PGECET-2022 Notification, Telangana PGECET, Mango News, Mango News Telugu,

తెలంగాణ రాష్ట్రంలో ఎంటెక్‌, ఎంఫార్మాసీ, ఎం.ఆర్క్ తదితర పీజీ ప్రొఫెషనల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే తెలంగాణ స్టేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(పీజీ ఈసెట్‌-2022) నోటిఫికేషన్‌ మార్చి 30న విడుదల అయింది. పీజీ ఈసెట్‌-2022 కోసం ఏప్రిల్ 12 నుంచి జూన్ 22 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. రూ.250 ఆలస్య రుసుముతో జూన్ 30వ తేదీ వరకు, రూ.1000 ఆలస్య రుసుముతో జులై 10 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు.

ఇక జులై 29 నుంచి ఆగస్టు 1 వరకు పీజీ ఈసెట్‌-2022 పరీక్షలు నిర్వహించనున్నారు. 2022 సంవత్సరానికి గానూ పీజీ ఈసెట్‌ పరీక్షను ఉస్మానియా విశ్వవిద్యాలయం నిర్వహిస్తుంది. పరీక్ష అర్హత, సిలబస్, సూచనలకు సంబంధించిన సమాచారం మరియు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ కోసం http://pgecet.tsche.ac.in/ లేదా http://www.tsche.ac.in/ వెబ్‌సైట్‌ లను సందర్శించాలని సూచించారు.

తెలంగాణ పీజీ ఈసెట్‌-2022 షెడ్యూల్‌:

  • పీజీ ఈసెట్‌ నోటిఫికేషన్‌ విడుదల: మార్చి 30
  • ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరణ: ఏప్రిల్ 12 నుంచి జూన్ 22 వరకు
  • రూ.250 ఆలస్య రుసుముతో దరఖాస్తులు స్వీకరణ: జూన్ 30
  • రూ.1000 ఆలస్య రుసుముతో దరఖాస్తులు స్వీకరణ: జులై 10
  • పీజీ ఈసెట్‌ పరీక్ష నిర్వహణ తేదీలు: జులై 29 నుంచి ఆగస్టు 1 వరకు
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − 10 =