ఏపీలో నవంబర్ మొదటి వారం నుంచి ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలి – సీఎం జగన్

CM Jagan Review Meet on Grain Procurement and Agricultural Activities in AP Today, Grain Procurement By AP, Andhra Pradesh Will Procure Grains , YS Jagan Reviews On Purchase Of Food Grains, YS Jagan On Purchase Of Food Grains, Mango News, Mango News Telugu, CM Tells Officials To Make Paddy Procurement, Andhra Pradesh Will Procure Grains, YS Jagan Govt Will Procure Grains, AP CM YS Jagan Latest News And Updates, AP CM YS Jagan Mohan Reddy Latest News And Updates, AP CM YS Jagan Mohan Reddy

ఆంధ్రప్రదేశ్‌లో నవంబర్ మొదటి వారం నుంచి ధాన్యం కొనుగోళ్లు మొదలు పెట్టాలని వ్యవసాయ శాఖ, అధికారులని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు ఆయన మంగళవారం తాడేపల్లి లోని సీఎం క్యాంపు కార్యాలయంలో ధాన్యం సేకరణ, వ్యవసాయ కార్యకలాపాలతో పాటు పౌరసరఫరాల శాఖపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షకు పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వర రావు, ఏపీ అగ్రిమిషన్‌ వైస్‌ఛైర్మన్‌ ఎం వి యస్‌ నాగిరెడ్డి, సీఎస్‌ సమీర్‌ శర్మ, వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, వ్యవసాయ శాఖ కమిషనర్ హరికిరణ్ సహా ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్ పలు కీలక సూచనలు చేశారు.

సమీక్షలో సీఎం జగన్ చేసిన కొన్ని కీలక సూచనలు..

  • నవంబర్ మొదటి వారం నుంచి ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలి.
  • ఖరీఫ్ సీజన్ ప్రారంభం కాకముందే మార్చి-మే నెలల్లోగా భూసార పరీక్షలు నిర్వహించాలి.
  • దీనికోసం రాష్ట్రం లోని అన్ని ఆర్బీకేలల్లో సాయిల్‌ టెస్టింగ్‌ పరికరం ఏర్పాటు చేయాలి.
  • అలాగే ముందుగా నిర్ణయించినట్లు నిర్ణీత సమయంలోగా ఇ-క్రాపింగ్‌ పూర్తిచేయాలి.
  • రంగు మారిన ధాన్యం, బ్రోకెన్ రైస్ లను ఇథనాల్‌ తయారీకి వినియోగించడంపై దృష్టి పెట్టాలి.
  • రైతులు ఎంఎస్పీ ధరలకు తగ్గకుండా పంటను అమ్మేలా అధికారులు చూడాలి.
  • పొగాకు రైతులకు నష్టం రాకుండా చర్యలు తీసుకోవాలి.
  • బియ్యం ఎగుమతులపై అధికారులు ఖచ్చితమైన సమాచారాన్ని అందించాలి.
  • కొనుగోలు చేసిన ధాన్యం నిల్వ చేసే ప్రాంతంలో జియో ఫెన్సింగ్, ఉతతులకు క్యూ ఆర్ కోడ్ ఎలాట్ చేస్తున్నట్లే పొరసరఫరాల శాఖలో కూడా ఈ విధానాన్ని అమలుచేయాలి.
  • అక్టోబర్ 17న నిర్వహించనున్న ‘రైతు భరోసా’ రెండో విడతకు అన్ని ఏర్పాట్లు చేయాలి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 3 =