అండర్‌-17 మహిళల ఫుట్‌బాల్‌ వరల్డ్‌కప్‌ నేటినుంచి ప్రారంభం.. తొలి మ్యాచ్‌లో అమెరికాతో తలపడనున్న భారత్‌

FIFA U-17 Women's World Cup India will Enters Ground as Underdogs Against USA in Their First Match Today, FIFA U-17 Women's World Cup, FIFA Women's World Cup USA Againast India, FIFA U-17 Women's World Cup 2022, Goalkeepers Monalisha Devi Moirangthem , Melody Chanu Keisham , Anjali Munda, Defenders Astam Oraon , Kajal , Naketa , Purnima Kumari , Varshika , Shilky Devi Hemam, Fifa U-17 World Cup 2022, FIFA India Announce 21-Member Squad, FIFA Under-17 Women's World Cup 2022, FIFA U-17 Latest News And Updates

అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) ఆధ్వర్యంలో నేటినుంచి అండర్‌-17 మహిళల ఫుట్‌బాల్‌ వరల్డ్‌కప్‌ సమరం నేటినుంచి ప్రారంభం కానుంది. భారతదేశం తొలిసారిగా ఆతిథ్యం ఇస్తున్న ఈ అండర్‌-17 మహిళల ఫుట్‌బాల్‌ వరల్డ్‌కప్‌ ఆరంభ మ్యాచ్ భువనేశ్వర్‌ లోని కళింగ స్టేడియంలో నిర్వహించనున్నారు. 2008లో శ్రీకారం చుట్టిన ఈ జూనియర్‌ వరల్డ్‌కప్‌ను రెండేళ్లకొకసారి నిర్వహిస్తున్నారు. ఇక చివరిసారిగా 2018లో ఉరుగ్వేలో నిర్వహించిన వరల్డ్‌కప్‌ ఫైనల్‌లో మెక్సికోను ఓడించిన స్పెయిన్‌ విజేతగా నిలిచింది. అయితే 2020లో కరోనా మహమ్మారి కారణంగా వరల్డ్‌కప్‌ రద్దయింది. దీంతో ఈ వరల్డ్‌కప్‌పై అందరికీ ఆసక్తి నెలకొంది.

ఈ నేపథ్యంలో మనదేశంలో ఫుట్‌బాల్‌ ఆటకు ఆదరణ పెంచేందుకు ‘కిక్‌ ఆఫ్‌ ద డ్రీమ్‌’గా టోర్నీ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేలా ఆలోచన చేశారు. మహిళా శక్తిని ప్రతిబింబించేలా ప్రపంచకప్‌ మస్కట్‌గా ఆసియా సివంగి ఇభాను రూపొందించారు. 20 రోజులపాటు సాగనున్న ఈ టోర్నీ మొదటి మ్యాచ్‌లో బ్రెజిల్‌తో మొరాకో తలపడనుండగా.. అనంతరం అమెరికాతో భారత్‌ తన తొలి మ్యాచ్‌ ఆడనుంది. దీంతో తొలిసారి ఆడుతున్న భారత్‌ అండర్‌ డాగ్‌గా బరిలోకి దిగనుండగా.. జట్టు నాకౌట్‌ చేరితే అదే గొప్ప విజయమని టీమిండియా కోచ్‌ థామస్‌ డెన్నర్‌బై పేర్కొన్నాడు. భారత్ మ్యాచ్ రాత్రి 8 గంటలకు జరుగనుంది. అలాగే ఈరోజు చిలీ-న్యూజిలాండ్‌ మరియు నైజీరియా-జర్మనీ జట్ల మధ్య కూడా మ్యాచ్‌లు జరుగనున్నాయి.

కాగా మొత్తం 16 జట్లు పాల్గొంటున్న క్రమంలో నాలుగు గ్రూపులు.. ఎ, బి, సి, డిగా వర్గీకరించారు. గ్రూప్‌-ఎలో భారత్‌, అమెరికా, మొరాకో, బ్రెజిల్‌ ఉన్నాయి. గ్రూప్‌-బిలో జర్మనీ, నైజీరియా, చిలీ, న్యూజిలాండ్‌ దేశాలు ఉన్నాయి. ఇక గ్రూప్‌-సిలో స్పెయిన్‌, కొలంబియా, మెక్సికో, చైనాలు ఉండగా.. గ్రూప్‌-డి:జపాన్‌, టాంజానియా, కెనడా, ఫ్రాన్స్‌ దేశాలు ఉన్నాయి. ప్రతి జట్టు తమ గ్రూప్‌ లోని మిగిలిన జట్లతో తలపడుతుంది. గ్రూప్‌లో టాప్‌-2లో నిలిచిన జట్లు నాకౌట్‌కు అర్హత సాధించనున్నాయి. ఈ నేపథ్యంలో గ్రూప్‌ మ్యాచ్‌లను నవీ ముంబై, గోవా, భువనేశ్వర్‌లోని స్టేడియాల్లో నిర్వహించనుండగా.. నాకౌట్‌లకు గోవా, నవీ ముంబై వేదిక కానున్నాయి. ఇక ఈ నెల 30న నవీ ముంబైలో జరిగే ఫైనల్‌తో టోర్నీ ముగియనుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty + twenty =