మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల నాలుగు రోజుల భారత పర్యటనలో భాగంగా శుక్రవారం హైదరాబాద్‌కు విచ్చేసారు. ఈ నేపథ్యంలో ఆయనతో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు భేటీ అయ్యారు. ఈ మేరకు వారు ఈరోజు ఉదయం హైదరాబాద్‌లో కలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్‌లో ఓ పోస్టు పెట్టారు. ఇద్దరు హైదరాబాదీలు కలుసుకున్నందున నేడు శుభదినం అవుతుందని ఆయన తన పోస్టులో పేర్కొన్నారు. అలాగే తామిద్దరి మధ్య బిజినెస్ మరియు బిర్యానీ గురించి చర్చ జరిగినట్లు తెలిపారు. కాగా తెలంగాణలో ఐటీ మరియు అనుబంధ రంగాల అభివృద్ధితో పాటు హైదరాబాద్‌లో వాటికి గల అపార అవకాశాలను మంత్రి కేటీఆర్, సత్య నాదెళ్లకు వివరించినట్లు తెలుస్తోంది. ఇంకా రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న సులభతర వ్యాపార విధానాలు మరియు ప్రోత్సాహకాలను గురించి కూడా నాదెళ్ళకు తెలిపినట్లు సమాచారం. ఇక గురువారం సత్య నాదెళ్ల ప్రధాని మోదీని కలిసిన విషయం తెలిసిందే. అలాగే బెంగుళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో కూడా ఆయన పాల్గొన్నారు.
Good start to the day when two Hyderabadis get to catch up @satyanadella
We chatted about Business & Biryani 😊 pic.twitter.com/3BomzTkOiS
— KTR (@KTRTRS) January 6, 2023
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE