తొలిసారిగా ఏసీ స్లీపర్ బస్సులను అందుబాటులోకి తీసుకొస్తున్న టీఎస్ఆర్టీసీ

TSRTC Decides to Operate 16 New AC Sleeper Buses from March,TSRTC Decides to Operate,16 New AC Sleeper Buses,TSRTC New AC Sleeper Buses,Mango News, Mango News Telugu,TSRTC,Tsrtc Online,Tsrtc Bus Enquiry,Tsrtc Bus Tracking,Tsrtc Cargo,Tsrtc Cargo Services,Tsrtc Official Website,Tsrtc Online Booking,Tsrtc Pf

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) మరో కీలక నిర్ణయం తీసుకుంది. తొలిసారిగా ఏసీ స్లీపర్ బస్సులను టీఎస్ఆర్టీసీ అందుబాటులోకి తీసుకువస్తుంది. తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సోమవారం ట్వీట్ చేస్తూ, రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు టీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలను అందించేందుకు రాష్ట్రంలోనే మొదటిసారిగా ఏసీ స్లీపర్ బస్సులను టీఎస్ఆర్టీసీ అందుబాటులోకి తీసుకురానుంది. మార్చ్ నుండి 16 కొత్త ఏసీ స్లీపర్ బస్సులు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు.

అలాగే టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ట్వీట్ చేస్తూ, “ప్రయాణికులకు నాణ్యమైన సేవలను అందించేందుకు తొలిసారిగా ఏసీ స్లీపర్ బస్సులను టీఎస్ఆర్టీసీ అందుబాటులోకి తెస్తోంది. 16 కొత్త ఏసీ స్లీపర్ బస్సులు మార్చి నెలలో అందుబాటులోకి వస్తాయి. బెంగళూరు, హుబ్లీ, విశాఖపట్నం, తిరుపతి, చెన్నై మార్గాల్లో ఈ బస్సులను సంస్థ నడపనుంది. హైదరాబాద్‌ లోని బస్ భవన్ ప్రాంగణంలో కొత్త ప్రోటో (నమూనా) ఏసీ స్లీపర్ బస్సును పరిశీలించడం జరిగింది” అని తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − 13 =