తెలంగాణాలో ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు

bjp, Center, CM KCR, Mango News, Mango News Telugu, Paddy logjam, Paddy Procurement, Paddy procurement issue, Paddy procurement issue in telangana, paddy procurement telangana, Parliament Sessions, Parliament Winter Sessions, Piyush Goyal, Piyush Goyal Sensational Comments Over Paddy Procurement, telangana, Telangana Chief Minister K Chandrasekhar Rao, telangana government, Telangana Latest News Updates, TRS, TRS Party, Union Minister Piyush Goyal, Union Minister Piyush Goyal Sensational Comments Over Paddy Procurement

ధాన్యం కొనుగోళ్ల విషయంలో తెరాస మరియు బీజేపీ మధ్య మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి. నవంబర్ నెలలో ముఖ్యమంత్రి కెసిఆర్ ఇందిరా పార్క్ వద్ద ఒక్కరోజు దీక్ష కూడా చేసి కేంద్రంపై విమర్శలు చేసారు. తర్వాత బీజేపీ నేతలు కూడా కెసిఆర్ పై విమర్శలు చేసారు. ఇదిలా ఉండగా, రాష్ట్రంలో చివరి గింజ వరకు కొంటామని ఈ మధ్యే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ రోజు పార్లమెంటులో తెరాస ఎంపీ కె. కేశవరావు తెలంగాణాలో ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం ఎందుకు ఉదాసీనంగా వ్యవహరిస్తోందని ప్రశ్నించారు.

దీనిపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సమాధానమిస్తూ.. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కెసిఆర్ ప్రభుత్వం రాజకీయం చేస్తోందని విమర్శించారు. ప్రతి విషయంలో తెలంగాణకు మద్దతిస్తున్నామన్న ఆయన ప్రతి ఏడాది కొనుగోలు పెంచుకుంటూ పోతున్నామని వెల్లడించారు. అన్ని విషయాల్లో రాష్ట్రానికి కేంద్రం నుంచి పూర్తి సహకారం ఇస్తున్నామని, అలాగే ధాన్యం కొనుగోళ్ల విషయంలో కూడా సహకరిస్తామని ఆయన అన్నారు. ఖరీఫ్ తర్వాత యాసంగి గురించి ఆలోచిద్దామని కేకే అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా ఆయన అన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ