మహారాష్ట్ర సీనియర్‌ నేత, ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ సంచలన నిర్ణయం.. పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా

Maharashtra Senior Politician Sharad Pawar Resigns as NCP Chief Today,Sharad Pawar Resigns as NCP Chief Today,Maharashtra Senior Politician Sharad Pawar,Mango News,Sharad Pawar Quits As NCP Chief,Sharad Pawar to quit as NCP chief,Sharad Pawar resigns as NCP chief,Sharad Pawar quits as NCP chief,Sharad Pawar steps down as NCP chief,Sharad Pawar Latest News,Sharad Pawar Latest Updates,Sharad Pawar News Live,Sharad Pawar,NCP Chief,Sharad Pawar Live Updates,Sharad Pawar Press Meet,Sharad Pawar

మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాజకీయ కురువృద్ధుడు, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ((ఎన్సీపీ) అధినేత శరద్‌ పవార్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అయితే మే 1నే పవార్ రాజీనామాను ప్రకటించాల్సి ఉండగా.. మహా వికాస్ అఘాడి కూటమి ర్యాలీ కారణంగా దానిని వాయిదా వేసుకున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ మేరకు మంగళవారం యశ్వంతరావు చవాన్ ప్రతిస్థాన్‌లో జరిగిన తన ఆత్మకథ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో శరద్ పవార్ తన రాజీనామాపై ఆకస్మిక ప్రకటన చేశారు. భవిష్యత్ విధానాలను రూపొందించడానికి పార్టీ సీనియర్ నేతలతో కూడిన ప్యానెల్‌ను కూడా పవార్ ప్రకటించడం గమనార్హం. దీంతో ఆయన నిర్ణయాన్ని ఎన్సీపీ నేతలు, కార్యకర్తలు నిరసించారు. ఆయన తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. దీంతో తాను వారిని విడిచి పెట్టడం లేదని, కేవలం పార్టీ పగ్గాలనే వదిలివేశానని పవార్ స్పష్టం చేశారు.

ఇదిలా ఉంటే.. మరోవైపు శరద్ పవార్ మేనల్లుడు అజిత్ పవార్ కేంద్రంగా బీజేపీ రాజకీయ ఎత్తుగడలు వేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో బీజేపీ-శివసేన పార్టీల సంకీర్ణ ప్రభుత్వం నడుస్తోన్న విషయం తెలిసిందే. అయితే సీఎం షిండే నేతృత్వంలోని శివసేనకు చెందిన సుమారు 17మంది ఎమ్మెల్యేల అనర్హత వేటుకి సంబంధించి త్వరలో సుప్రీంలో తీర్పు రానున్న నేపథ్యంలో.. ప్రభుత్వం కూలిపోకుండా చూసేందుకు ఎన్సీపీ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలను తీసుకొస్తే, అజిత్ పవార్ ను ముఖ్యమంత్రిని చేస్తామని బీజేపీ ఆఫర్ ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాల క్రమంలోనే శరద్ పవార్ రాజీనామా చేయడం విశేషం. అయితే పార్టీ బాధ్యతలు చేపట్టబోయే తదుపరి అధ్యక్షుడు శరద్ పవార్ మార్గదర్శకత్వంలోనే పని చేస్తారని అజిత్ పవార్ వెల్లడించడం విశేషం. ఇక శరద్‌ పవార్‌ దేశంలోని జాతీయస్థాయి కలిగిన నాయకులలో ఒకరిగా గుర్తింపు పొందారు. మహారాష్ట్రలో శివసేన, కాంగ్రెస్ పార్టీలతో కలిసి ‘మహా వికాస్ అఘాడి’ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 5 =