టీ20 ప్రపంచకప్‌-2021 షెడ్యూల్ విడుదల, అక్టోబర్ 24న భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్

ICC announces T20 World Cup 2021 schedule, ICC released the full schedule of T20 World Cup, ICC releases schedule, ICC T20 World Cup, India to Face Pakistan on October 24, India-Pakistan, India-Pakistan match on October 24, India-Pakistan match on October 24 in Dubai, Mango News, T20 World Cup, T20 World Cup 2021 Schedule, T20 World Cup Schedule, T20 World Cup-2021, T20 World Cup-2021 Full Schedule Released

టీ20 ప్రపంచ కప్-2021 అక్టోబర్ 17 నుండి నవంబర్ 14 వరకు యూఏఈ మరియు ఒమన్లలో జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీ20 ప్రపంచకప్‌ షెడ్యూల్ ను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) మంగళవారం నాడు విడుదల చేసింది. టీ20 ప్రపంచకప్‌ లో ముందుగా రౌండ్-1 లో గ్రూప్‌-ఎ, గ్రూప్-బి జట్లు తలపడనున్నాయి. గ్రూప్‌-ఎ లోని నాలుగు జట్ల మధ్య (శ్రీలంక, ఐర్లాండ్‌, నెదర్లాండ్స్‌, నమీబియా) మరియు గ్రూప్‌-బిలోని నాలుగు జట్ల మధ్య (బంగ్లాదేశ్‌, స్కాట్లాండ్‌, పపువా న్యూగినియా, ఒమన్‌) అక్టోబర్ 17 నుంచి అక్టోబర్ 22 వరకు మ్యాచులు జరగనున్నాయి. అనంతరం ఈ రెండు గ్రూపుల్లోని విన్నర్, రన్నరప్‌ జట్లు సూపర్‌-12లో ఇప్పటికే అర్హత సాధించిన మిగిలిన 8 జట్లతో చేరనున్నాయి.

ఇక సూపర్ 12 రౌండ్ లో గ్రూప్-1 లోని 6 జట్ల మధ్య (ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌, విన్నర్ గ్రూప్‌-ఎ, రన్నరప్ గ్రూప్-బి) మరియు గ్రూప్‌-2 లోని 6 జట్ల మధ్య (భారత్‌, పాకిస్థాన్‌, న్యూజిలాండ్‌, ఆఫ్ఘనిస్థాన్, రన్నరప్ గ్రూప్-ఏ, విన్నర్ గ్రూప్‌-బి) అక్టోబర్ 23 నుంచి నవంబర్ 8 వరకు మ్యాచులు జరగనున్నాయి. ఐసీసీ విడుదల చేసిన గ్రూపుల్లో భారత్‌, పాకిస్తాన్ జట్లు ఒకే గ్రూపులో (గ్రూప్-2) ఉన్నాయి. దీంతో మరోసారి దాయాదుల మధ్య పోరు అక్టోబర్ 24న జరగనుంది.

ఇక మొదటి సెమీ ఫైనల్ అబుదాబిలో నవంబర్ 10న, రెండవ సెమీ ఫైనల్ దుబాయ్ లో నవంబర్ 11న జరుగనుంది. ఇక రెండు సెమీఫైనల్స్‌కు రిజర్వ్ డేని ప్రకటించారు. అలాగే టీ20 ప్రపంచ కప్-2021 ఫైనల్ నవంబర్ 14, ఆదివారం నాడు జరుగనుంది. నవంబర్ 15, సోమవారంను ఫైనల్ కోసం రిజర్వ్ డేగా ప్రకటించారు. ముందుగా ఈ టీ20 ప్రపంచ కప్ టోర్నమెంట్ భారత్ లో జరగాల్సి ఉండగా, కరోనా సెకండ్ వేవ్ పరిణామాల నేపథ్యంలో యూఏఈ మరియు ఒమన్లకు మార్చారు. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం, అబుదాబిలోని షేక్ జాయెద్ స్టేడియం, షార్జా స్టేడియం మరియు ఒమన్ క్రికెట్ అకాడమీ గ్రౌండ్ అనే నాలుగు వేదికలలో బీసీసీఐ ఈ టోర్నమెంట్ కు ఆతిథ్యమివ్వనుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × three =