రాష్ట్రాలకు యూనియన్ హెల్త్ సెక్రటరీ లేఖ

Centre extends existing Covid-19 guidelines, Coronavirus India Highlights, Coronavirus updates December 2021, Covid B.1.1.529 variant, covid-19 new variant, latest updates on Omicron, Mango News, Mango News Telugu, New coronavirus Strain, New Covid 19 Variant, New Covid Strain Omicron, Omicron, Omicron Alert, Omicron Alert Union Health Department Issues Guidelines To States, Omicron coronavirus scare, Omicron covid variant, Omicron variant, omicron variant in India, omicron variant south africa, Union health department, Union Health Department Issues Guidelines To States, Union health ministry on Omicron, Update on Omicron

ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఒమిక్రాన్ వేరియెంట్ మన దేశంలో నిన్న వెలుగుచూసిన విషయం తెలిసిందే. దీని తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. ఒమిక్రాన్ వేరియెంట్ గురించి, దానిపై తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కేంద్రం అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ఈ విషయమై యూనియన్ హెల్త్ సెక్రటరీ అన్ని రాష్ట్రాలకు లేఖ రాశారు. ప్రతి రాష్ట్రం ఒమిక్రాన్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ప్రజలందరికి వాక్సిన్ అందుబాటులో ఉంచాలని.. విరివిగా కోవిడ్ టెస్టులు చేయాలనీ సూచించారు. ప్రమాదకరంగా ఉండే క్లస్ట్రర్లు, హాట్ స్పాట్స్ గుర్తించాలని, ఆయా ప్రాంతాల్లో ప్రజలకు మెడికల్ వసతులు అన్ని అందుబాటులో ఉంచాలని రాశారు.

విదేశీ ప్రయాణాలు చేసేవారు తగు జాగ్రత్తలు తీసుకునేలా రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో కోరారు. ఇప్పటికే టెస్టుల్లో ఎవరైనా పాజిటివ్ గా తేలితే వెంటనే సెకండరీ కాంటాక్టులను గుర్తించాలని, 72 గంటల్లోపు వారికి కూడా త్వరితగతిన టెస్టులు చేయించి అవసరం అయితే క్వారంటైన్ కి పంపాలని ఆ లేఖలో కోరారు. ప్రధానంగా రద్దీగా ఉండే ప్రాంతాలు, కూడళ్లు గుర్తించాలని.. అక్కడి ప్రజలని భౌతిక దూరం పాటించేలా, తప్పనిసరిగా మాస్కులు ధరించేలా చర్యలు తీసుకోవాలని లేఖలో సూచించారు. ఈ పాండమిక్ సిట్యుయేషనులో ప్రభుత్వాలు ప్రజలకు రక్షణగా నిలవాలని, అవసరమైన అన్ని వనరులను అందుబాటులో ఉంచుకోవాలని ఆ లేఖలో కోరారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − four =