కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌ తో కేటీఆర్‌, టీఆర్‌ఎస్ ఎంపీలు భేటీ, ధాన్యం కొనుగోళ్లపై చర్చ

Centre lobs paddy data ball into Telangana court, KT Rama Rao Meets Piyush Goyal in Delhi, KTR seeks clarity from Centre on paddy purchase, Mango News, Minister KTR, Minister KTR and TRS MPs Team Meets Union Minister Piyush Goyal, Minister KTR and TRS MPs Team Meets Union Minister Piyush Goyal Over Paddy Procurement, Paddy Procurement, Paddy procurement across Telangana, Paddy procurement In Telangana, Paddy procurement issue, Paddy procurement issue in telangana, TRS MPs Team Meets Union Minister Piyush Goyal, TRS MPs Team Meets Union Minister Piyush Goyal Over Paddy Procurement, TRS to Protest Against Centre

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సహా పలువురు రాష్ట్రమంత్రులు ఢిల్లీలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై మంత్రులు, అధికారులు వరుసగా కేంద్రమంత్రులతో భేటీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం నాడు తెలంగాణ రాష్ట్ర మంత్రులు కేటీఆర్, నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్ మరియు టీఆర్ఎస్ ఎంపీలు, రాష్ట్ర ఉన్నతాధికారులతో కూడిన బృందం కేంద్ర వాణిజ్యం, పరిశ్రమలు మరియు ఆహార, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్ గోయల్‌ ను కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణలో ఉత్పత్తి అయ్యే వరిధాన్యం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని కేంద్ర మంత్రిని మంత్రుల బృందం కోరింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరగడం, వరిపంట సాగు అవుతున్న విధానం, వస్తున్న దిగుబడి, కొనుగోళ్లపై స్పష్టత లేకపోవడంతో రైతుల పడుతున్న ఇబ్బందులు సహా అనేక అంశాలను కేంద్ర మంత్రికి తెలంగాణ మంత్రులు వివరించి, త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరినట్టు తెలుస్తుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen − three =