వరంగల్ చిన్నారి కేసులో ముద్దాయికి ఉరిశిక్ష

9 Months Infant Murder, 9 Months Infant Murder Case, Mango News Telugu, telangana, Telangana Politics, Verdict On 9 Months Infant Murder Case, Warangal Court, Warangal Court Sensational Verdict, Warangal Court Sensational Verdict On 9 Months Infant Murder, Warangal Court Sensational Verdict On 9 Months Infant Murder Case

జూన్ నెలలో తెలుగు రాష్ట్రాల్లో తొమ్మిదినెలల చిన్నారిపై జరిగిన అత్యాచారం, హత్య కేసు సంచలనం సృష్టించింది. వరంగల్ లో జరిగిన ఈ సంఘటనపై జిల్లా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. తొమ్మిది నెలల చిన్నారి శ్రీహిత కేసులో ముద్దాయి అయిన ప్రవీణ్ కి కోర్టు ఉరిశిక్ష విధించింది. జూన్ 18వ తేదీన తన తల్లితో పాటు డాబా పై నిద్రిస్తున్న చిన్నారిని ప్రవీణ్ ఎత్తుకెళ్ళి అత్యాచారం చేసి చంపాడు. పోలీసులు కేసు నమోదు చేసి త్వరితగతిన విచారణ సాగించి కోర్టులో నివేదికలు సమర్పించారు. జూలై 24న ప్రారంభమైన విచారణ ఈ నెల 2వ తేదీతో ముగిసింది, మొత్తం 30 మంది సాక్ష్యులు ఈ కోర్టులో హాజరై వివరణ ఇచ్చారు. ఈ రోజు తీర్పు వెలువరించిన వరంగల్ జిల్లా అదనపు కోర్టు ప్రవీణ్ ను దోషిగా నిర్దారింఛి, ఇటువంటి చర్యకు పాల్పడినందుకు ఉరిశిక్ష విధించింది. ఈ తీర్పును న్యాయమూర్తి జయకుమార్ వెల్లడించారు.

ఈ కేసులో కీలక అంశాలను వివరిస్తూ మద్యం మత్తులో ఇటువంటి ఘాతుకానికి పాల్పడినట్టు ముద్దాయి ప్రవీణ్ అంగీకరించినట్టు న్యాయవాదులు తెలిపారు. నేరం జరిగిన 50 రోజుల్లోనే వేగవంతంగా విచారణ పూర్తి చేసి తీర్పు వెలువరించడం పట్ల వారు అనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులో ఎవరు కూడ ముద్దాయి ప్రవీణ్ తరుపున వాదించకూడదని వరంగల్ బార్ అసోసియేషన్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. జరిగిన సంఘటన పట్ల ఎంతో వేదన పడ్డ కుటుంబసభ్యులు, ప్రజలు కోర్టు నిర్ణయం పై ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

 

[subscribe]
[youtube_video videoid=tPT_g2YJ5Ic]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

7 + 6 =