ఏపీలో నేడే తోలి కియా కారు విడుదల

2020 kia seltos, kia, kia cars, kia motors, kia motors india, kia seltos, kia seltos 2019, kia seltos features, kia seltos india, kia seltos india price, kia seltos india review, kia seltos interior, kia seltos launch, kia seltos price, kia seltos price in india, kia seltos review, kia seltos review india, kia seltos test drive, kia sp, Mango News Telugu, seltos, seltos kia, seltos review

అనంతపురంలోని పెనుగొండలో ఏర్పాటైన కియా మోటార్స్ సంస్థ ఈ రోజు తన తోలి కారును విడుదల చేస్తుంది. కియా మోటార్స్ మార్కెట్ లోకి ‘సెల్టోస్’ అనే కొత్త కారును ప్రవేశపెడుతుంది. 2017లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వంతో కియా ప్రతినిధులు కార్ల పరిశ్రమకు ఎంవోయూ చేసుకున్నారు. 2017 మే నెల నుండి పనులు ప్రారంభించారు, దాదాపు రూ. 8 వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో మొదలైన ఈ సంస్థ ప్రత్యక్షంగా వేల మందికి ఉపాధి కల్పించింది. 2018 ఫిబ్రవరి నెలలో జరిగిన ప్రేమ్ ఇన్స్టాలేషన్ కార్యక్రమానికి మరియు 2019 జనవరిలో జరిగిన కియా కారు టెస్ట్ డ్రైవ్ కార్యక్రమానికి ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు హాజరయ్యారు.

కియా మోటార్స్ సంస్థలో 2019 జూలై నుంచి కార్ల ఉత్పత్తి ప్రారంభించగా, ఆగస్టు 8వ తేదీన తోలికారు సెల్టోస్ ను విడుదల చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి కియా కంపెనీ ప్రతినిధుల ఆహ్వానం మేరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి హాజరు కావాల్సి ఉండగా, ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన పొడిగింపు కావడంతో షెడ్యూలు ప్రకారం ఈ కార్యక్రమానికి హాజరు కాలేక పోతున్నారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఇతర మంత్రులతో కలిసి కియా కారు విడుదల కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. కియా మోటార్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ కుక్ హ్యూన్ షిమ్, ఇతర కియా సిబ్బంది కూడ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.

ఏడాదికి 3 లక్షల కార్లు ఉత్పత్తే లక్ష్యంగా కంపెనీ ప్రతినిధులు ఇక్కడి పరిశ్రమలో ఏర్పాట్లు చేసుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కియా మొదటి కారు రోడ్డుపైకి వస్తున్న సందర్భంగా కియా సంస్థకు అభినందనలు తెలియజేశారు. కియా మోటార్స్ ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నదని, ఆటోమొబైల్ రంగంలో కియా నూతన ధోరణి తీసుకురావాలని శుభాకాంక్షలు తెలియజేసారు.

 

Subscribe to our Youtube Channel Mango News for the latest News.

Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here