ముగిసిన సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు.. అశ్రునయనాలతో అభిమానుల తుది వీడ్కోలు

Superstar Krishna Last Rites Completed with Telangana State Formalities at Maha Prasthanam Today,Superstar Krishna Last Rites,Telangana State Formalities,Maha Prasthanam,Mango News,Mango News Telugu,Actor Superstar Krishna,Superstar Krishna,Senior Actor Krishna,Superstar Krishna Latest News And Updates,Actor Krishna, Actor Krishna Hospitalized,Krishna Hospitalized,Krishna News And Live Updates,Superstar News And Updates

సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు పూర్తయ్యాయి. మధ్యాహ్నం 2:30 గంటల తర్వాత పద్మాలయా స్టూడియోస్ నుంచి ఆయన అంతిమయాత్ర ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆయనను కడసారి తమ అభిమాన హీరోను చూసేందుకు వచ్చిన అభిమానులు ఉద్వేగానికి లోనయ్యారు. పూలతో అలంకరించిన వాహనంలో కృష్ణ పార్థివదేహం ముందు కదులుతుండగా.. భారీ భద్రత నడుమ కృష్ణ అంతిమయాత్ర ప్రస్థానం చేరుకుంది. అనంతరం తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. పోలీసులు మూడుసార్లు గాలిలోకి కాల్పులు జరిపి సూపర్ స్టార్ కృష్ణకు గౌరవ వందనం సమర్పించారు.

ఈ క్రమంలో చివరిగా మహేష్ బాబు తండ్రి చితికి నిప్పంటించి లాంఛనం పూర్తి చేశారు. కాగా అంతిమయాత్ర కొనసాగుతున్న మార్గం మొత్తం రోడ్డుకిరువైపులా ప్రజలు నిలబడి ‘జోహార్ కృష్ణ’, ‘కృష్ణా అమర్ రహే’ అంలూ నినాదాలు చేస్తూ వీడ్కోలు పలికారు. కాగా దాదాపు ఐదు దశాబ్దాలపాటు తెలుగు చిత్ర పరిశ్రమలో కొనసాగిన కృష్ణ 350 పైచిలుకు చిత్రాలలో నటించారు. ఇక కృష్ణ సోమవారం రాత్రి తీవ్ర అస్వస్థతో హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం వేకువజామున తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన మృతిపట్ల ప్రధాని మోదీ, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సహా పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here