టాలీవుడ్‌లో సరికొత్త ప్రయోగాలతో వచ్చే చిత్రాలకు ఎప్పుడూ ప్రత్యేక ఆదరణ ఉంటుంది. అదే బాటలో మ్యాంగో తెలుగు సినిమా యూట్యూబ్ ఛానల్‌లో విడుదలైన ‘ఆపరేషన్ బ్లాక్ మార్కెట్’ అనే ఇండిపెండెంట్ ఫిల్మ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. దర్శకుడు చంద్ర కిరణ్ ఈ చిత్రాన్ని చాలా ఉత్కంఠ రేపే విధంగా చిత్రీకరించారు. ఆర్. సురేంద్ర రెడ్డి నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రం, టైటిల్‌తోనే అందరిలో విపరీతమైన ఆసక్తిని రేకెత్తిస్తోంది.
అర్జున్, శంకర్, మహేష్, హరి, ఖౌషిక్, రాజేష్, యష్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు సుధాకర్ మారియో అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (సంగీతం) మేజర్ అసెట్‌గా నిలిచింది. అసలు ఈ ‘ఆపరేషన్ బ్లాక్ మార్కెట్’ వెనుక ఉన్న రహస్యం ఏంటి? తెరవెనుక జరిగిన ఆ చీకటి ముఠా కథేంటి? తెలుసుకోవాలంటే వెంటనే ‘మ్యాంగో తెలుగు సినిమా’ యూట్యూబ్ ఛానల్‌లో ఈ చిత్రాన్ని చూసేయండి.








































