జెన్సన్ హువాంగ్ రీ-ఎంట్రీ.. ఎన్విడియా షేర్లు 30% జంప్, అధ్యక్షుడు ట్రంప్‌కు సిరుల వర్షం

Nvidia Shares Surge Over 30% Jensen Huang Gains $34 Billion, Trump Gets Up to $15 Million in Single Day

ప్రపంచ అగ్రగామి కృత్రిమ మేధ (ఏఐ) చిప్ తయారీ సంస్థ ‘ఎన్విడియా’ (Nvidia) సీఈఓగా జెన్సన్ హువాంగ్ పునరాగమనం చేయడం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు భారీ ఆర్థిక లాభాలను తెచ్చిపెట్టింది. ట్రంప్ ఇటీవల వెల్లడించిన ఆర్థిక వివరాల ప్రకారం, ఎన్విడియాలో ఆయనకు గరిష్ఠంగా 3.70 లక్షల షేర్లు ఉన్నాయి.

సోమవారం ఎన్విడియా డైరెక్టర్ల బోర్డు జెన్సన్‌ను తిరిగి సీఈఓగా నియమిస్తూ నిర్ణయం తీసుకున్న గంటల వ్యవధిలోనే కంపెనీ షేర్లు 30 శాతానికి పైగా దూసుకెళ్లాయి. ఈ ర్యాలీతో ట్రంప్ వద్ద ఉన్న ఎన్విడియా షేర్ల విలువ ఒక్క రోజులోనే సుమారు 15 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో రూ.139 కోట్లకు పైగా) పెరిగినట్లు అంచనా.

జెన్సన్ హువాంగ్ తిరిగి బాధ్యతలు చేపట్టడంపై ట్రంప్ తీవ్ర ఉత్సాహం వ్యక్తం చేస్తూ, తన సోషల్ మీడియా వేదిక ‘ట్రూత్ సోషల్’లో ఆసక్తికర పోస్ట్ పెట్టారు. గతంలో ఎన్నికల ప్రచారం సందర్భంగా తనపై దాడి జరిగినప్పుడు తీసిన ఐకానిక్ ఫొటోను మార్ఫింగ్ చేసి, జెన్సన్ రాకకు స్వాగతం పలుకుతున్నట్లుగా ట్రంప్ షేర్ చేశారు.

ఎన్విడియా బోర్డుతో తాను మాట్లాడి జెన్సన్‌ను తిరిగి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించానని ట్రంప్ పేర్కొనగా, ప్రకటనకు ముందు జరిగిన స్టాక్ లావాదేవీలపై విచారణ జరపాలని డెమోక్రటిక్ సెనేటర్ రూబెన్ గాలెగో డిమాండ్ చేయడం గమనార్హం.

మరోవైపు, సంస్థలోకి తిరిగి వచ్చిన గంటల వ్యవధిలోనే జెన్సన్ హువాంగ్ వ్యక్తిగత సంపద కూడా రికార్డు స్థాయిలో పెరిగింది. అమెరికా స్టాక్ మార్కెట్ ముగిసే సమయానికి ఆయన వాటా షేర్లు ఒక్క రోజులోనే 34 బిలియన్ డాలర్ల (సుమారు రూ.3.4 లక్షల కోట్లు) లాభాలను ఆర్జించి పెట్టాయి.

ఫోర్బ్స్ రియల్‌టైమ్ బిలియనీర్స్ జాబితా ప్రకారం, జెన్సన్ నికర సంపద 144 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇటీవల చోటుచేసుకున్న వివాదాలు, షేర్ల అమ్మకాల ఒత్తిడితో ఫోర్బ్స్ జాబితాలో 10వ స్థానం నుండి 18వ స్థానానికి పడిపోయిన జెన్సన్, తాజా లాభాలతో తిరిగి 13వ స్థానానికి ఎగబాకారు.

జెన్సన్ పునర్నియామకం పెట్టుబడిదారుల్లో నూతన ఉత్సాహాన్ని నింపడంతో ఒక్క రోజులోనే ఎన్విడియా మార్కెట్ విలువ ఏకంగా 1 ట్రిలియన్ డాలర్లు (సుమారు రూ.92 లక్షల కోట్లు) పెరిగి 3.98 ట్రిలియన్ డాలర్లకు చేరింది. అమెరికా స్టాక్ మార్కెట్ చరిత్రలోనే ఒక కంపెనీ విలువ ఒక్క రోజులో ఇంత భారీగా పెరగడం ఇదే తొలిసారి.

మరోవైపు ఎన్విడియా దెబ్బతో చిప్‌మేకర్లు, ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, సాఫ్ట్‌వేర్ కంపెనీల షేర్లు కూడా భారీగా లాభపడటంతో నాస్‌డాక్ 100 మార్కెట్ క్యాపిటలైజేషన్‌కు దాదాపు 2 ట్రిలియన్ డాలర్లు అదనంగా తోడయ్యాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here