వినాయక చవితి వేడుకల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసే గణేశ్ మండపాలకు ఉచిత విద్యుత్ సరఫరా చేయనున్నట్లు మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
I am happy to announce that this #GaneshChaturthi, all Ganesh pandals across #AndhraPradesh will be provided free electricity. This is a major festive initiative by our government to support communities celebrating across the state and make the celebrations even more vibrant.…
— Lokesh Nara (@naralokesh) September 9, 2026
గణేశ్ పండళ్లకు ఉచిత విద్యుత్
గణేశ్ చతుర్థి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ అంతటా ఏర్పాటు చేసే గణేశ్ పండళ్లకు ఉచిత విద్యుత్ అందించనున్నట్లు ప్రకటించడం సంతోషంగా ఉందని మంత్రి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు పండుగను ఉత్సాహంగా జరుపుకునేలా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు.
గణేశ్ ఉత్సవాల సందర్భంగా మండపాల నిర్వాహకులకు విద్యుత్ ఖర్చు భారంగా మారకుండా ఈ నిర్ణయం ఉపయోగపడనుంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో భక్తులు, ప్రజలు పెద్ద ఎత్తున గణేశ్ విగ్రహాలను ఏర్పాటు చేసి ఉత్సవాలు నిర్వహిస్తారు.
వేడుకలకు ప్రభుత్వం అండగా
రాష్ట్రవ్యాప్తంగా గణేశ్ చతుర్థి వేడుకలు జరుపుకుంటున్న ప్రజలకు అండగా నిలవడమే తమ ప్రభుత్వ ఉద్దేశమని మంత్రి లోకేష్ తెలిపారు. పండుగను మరింత ఉత్సాహభరితంగా నిర్వహించుకునేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని పేర్కొన్నారు.
ప్రజల పండుగలు, సంప్రదాయాలకు ప్రభుత్వం సహకరిస్తుందనే సందేశాన్ని ఈ నిర్ణయం ఇస్తుందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
ప్రతి కుటుంబానికి సిరిసంపదలు కలగాలి
గణేశుడి ఆశీస్సులు ప్రతి కుటుంబానికి సిరిసంపదలు, సంతోషం, విజయాన్ని ప్రసాదించాలని మంత్రి నారా లోకేష్ ఆకాంక్షించారు. వినాయక చవితిని ప్రజలంతా భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆయన కోరారు.
ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా గణేశ్ మండపాల నిర్వాహకులకు విద్యుత్ ఖర్చు విషయంలో ఊరట లభించనుంది.






































