బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై స్పీకర్ వేటు.. సెషన్ ముగిసే వరకు సస్పెన్షన్

BRS MLAs Suspended For Entire Session After Protest in Telangana Assembly

తెలంగాణ అసెంబ్లీలో బుధవారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సభ ప్రారంభమైన వెంటనే బీఆర్‌ఎస్ సభ్యులు నిరసనకు దిగడంతో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. బీఆర్‌ఎస్‌కు చెందిన ఎమ్మెల్యేలు అందరినీ అసెంబ్లీ నుంచి సెషన్ ముగిసే వరకు సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.

సభ ప్రారంభమైన వెంటనే నిరసన

మహిళా సభ్యుల పట్ల పోలీసులు అనుచితంగా ప్రవర్తించారంటూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు సభలో ఆందోళన చేపట్టారు. ఈ ఘటనపై క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. ‘వుయ్ వాంట్ జస్టిస్’ అంటూ నినదిస్తూ సభా కార్యకలాపాలకు అడ్డుతగిలారు.

బీఆర్‌ఎస్ సభ్యుల నిరసనతో సభలో కొంతసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.

మంత్రి శ్రీధర్ బాబు ప్రతిపాదన

దీంతో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను సభ నుంచి సెషన్ మొత్తం సస్పెండ్ చేయాలని మంత్రి శ్రీధర్ బాబు ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆమోదించారు.

సస్పెండ్ అయిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు వీరే..!

  • హరీశ్ రావు
  • కేటీఆర్
  • జగదీశ్ రెడ్డి
  • కౌశిక్ రెడ్డి
  • అనిల్ జాదవ్
  • మాధవరం కృష్ణారావు
  • కోవా లక్ష్మీ
  • కొనికంటి మాణిక్ రావు
  • చింతా ప్రభాకర్
  • ప్రభాకర్ రెడ్డి
  • వేముల ప్రశాంత్ రెడ్డి
  • మర్రి రాజశేఖర్ రెడ్డి
  • పల్లా రాజేశ్వర్ రెడ్డి
  • సబితా ఇంద్రారెడ్డి
  • సంజయ్
  • తలసాని శ్రీనివాస్ యాదవ్
  • దేవిరెడ్డి సుధీర్ రెడ్డి
  • వాకిటి సునీతా లక్ష్మారెడ్డి
  • కాలేరు వెంకటేశ్
  • విజయుడు
  • కేపీ వివేకానంద‌

టీ బ్రేక్‌కు సభ వాయిదా

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్ అనంతరం శాసనసభను టీ బ్రేక్ కోసం వాయిదా వేశారు. సభలో బీఆర్‌ఎస్ సభ్యుల నిరసన, అనంతరం సస్పెన్షన్‌తో అసెంబ్లీ రాజకీయంగా వేడెక్కింది. మహిళా సభ్యుల పట్ల పోలీసుల వ్యవహారంపై బీఆర్‌ఎస్ చేసిన ఆరోపణలు, ప్రభుత్వ చర్యలపై తదుపరి పరిణామాలు ఆసక్తికరంగా మారాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here