సీఎం కేసీఆర్ పుట్టినరోజు: వినూత్నంగా అభిమానం చాటిన తూర్పుగోదావరి జిల్లా వాసులు

CM KCR Birthday, CM KCR Birthday Celebrations, KCR Birthday, Koti Vruksharchana, Koti Vruksharchana Program, Koti Vruksharchana Programe On CM KCR Birthday, Mango News, Nursery Owners From Kadiam, Nursery Owners From Kadiam Expressed their Birthday Greetings To KCR, One crore saplings to be planted on CM KCR Birthday, Plant saplings to mark KCR birthday, Telangana CM KCR Birthday, Vruksharchana Program

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పుట్టినరోజును పురస్కరించుకొని తూర్పు గోదావరి జిల్లా కడియం పల్ల వెంకన్న నర్సరీ నిర్వాహకులు వినూత్నంగా తమ అభిమానాన్ని చాటుకున్నారు. తూర్పు గోదావరి జిల్లా వాసులు పల్ల సత్తిబాబు, పల్ల సుబ్రహ్మణ్యం, పల్ల గణపతి రంగురంగుల పూలు, పూలమొక్కలతో సీఎం కేసీఆర్ చిత్రపటాన్ని సృజనాత్మకంగా తీర్చిదిద్ది జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేందుకు సీఎం కేసీఆర్ ప్రారంభించిన హరితహారం కార్యక్రమంతో ప్రేరణ పొంది తాము ఈ విధంగా వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపామని వారు తెలిపారు. తెలంగాణేతర ప్రజలు ఈ విధంగా తెలంగాణ సీఎం కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలపడం పలువురిని ఆకర్షించింది.

 

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ