సీబీఎస్ఈ 10, 12 తరగతుల బోర్డు పరీక్షల షెడ్యూల్ విడుదల

CBSE Class 10 and 12 Board Exams Schedule Released, Start from February 16

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 10, 12 తరగతుల బోర్డ్ ఎగ్జామ్ డేట్ షీట్ (Date Sheet) ను అధికారికంగా విడుదల చేసింది. ఫిబ్రవరి 16 నుంచి దేశవ్యాప్తంగా సీబీఎస్ఈ 10, 12వ తరగతుల బోర్డు పరీక్షలు ప్రారంభం కానున్నాయని బోర్డు స్పష్టం చేసింది. పదో తరగతి పరీక్షలు మార్చి 9తో ముగియనుండగా, 12వ తరగతి పరీక్షలు ఏప్రిల్ 9వ తేదీ వరకు కొనసాగనున్నాయి.

నమూనా పేపర్లు

పరీక్షల విధానం, ప్రశ్నల సరళిపై అవగాహన కోసం సీబీఎస్ఈ నమూనా ప్రశ్నాపత్రాలను (Sample Question Papers) కూడా విడుదల చేసింది. విద్యార్థులు అధికారిక సైట్ cbseacademic.nic.in నుంచి వీటిని చూసి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

పరీక్షలకు సంబంధించిన పూర్తి టైమ్‌టేబుల్‌ను విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ cbse.gov.in ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సూచించింది.

పదో తరగతి (Class 10) మేజర్ పేపర్ల షెడ్యూల్:

తేదీ సబ్జెక్ట్
ఫిబ్రవరి 16 పెయింటింగ్
ఫిబ్రవరి 17 మ్యాథమేటిక్స్ (స్టాండర్డ్ / బేసిక్)
ఫిబ్రవరి 22 సైన్స్
ఫిబ్రవరి 24 కంప్యూటర్ అప్లికేషన్స్ / ఐటీ / ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
ఫిబ్రవరి 26 ఇంగ్లిష్ (కమ్యూనికేటివ్, ల్యాంగ్వేజ్ అండ్ లిటరేచర్)
మార్చి 3 హిందీ (కోర్స్ A & B)
మార్చి 8 సోషల్ సైన్స్

12వ తరగతి (Class 12) మేజర్ పేపర్ల షెడ్యూల్:

తేదీ సబ్జెక్ట్
ఫిబ్రవరి 16 ఫిజిక్స్
ఫిబ్రవరి 18 ఫిజికల్ ఎడ్యుకేషన్
ఫిబ్రవరి 23 అకౌంటెన్సీ
ఫిబ్రవరి 25 జాగ్రఫీ
ఫిబ్రవరి 27 కెమిస్ట్రీ
మార్చి 2 సైకాలజీ
మార్చి 5 ఇంగ్లిష్ (ఎలెక్టివ్ / కోర్)
మార్చి 9 మ్యాథ్స్ / అప్లైడ్ మ్యాథ్స్
మార్చి 13 హిందీ (ఎలెక్టివ్ / కోర్)
మార్చి 16 ఎకనామిక్స్
మార్చి 19 పొలిటికల్ సైన్స్
మార్చి 20 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)
మార్చి 25 బయోలజీ
మార్చి 27 హిస్టరీ
మార్చి 30 సోషియాలజీ
మార్చి 31 కంప్యూటర్ సైన్స్ / ఐటీ / ఇన్ఫర్మాటిక్స్ ప్రాక్టీసెస్
ఏప్రిల్ 1 బిజినెస్ స్టడీస్ / బిజినెస్ అడ్మినిస్ట్రేషన్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here