ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ఉపాధ్యాయ ఉద్యోగార్థులకు తీపి కబురు అందించింది. తాజాగా డీఎస్సీ-2026 (AP DSC 2026 / APTRT) నోటిఫికేషన్ను అధికారికంగా విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,721 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనుండగా, ఇందుకోసం విద్యాశాఖ మూడు వేర్వేరు నోటిఫికేషన్లను ప్రకటించింది. ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఈ ప్రకటన ఊరటనివ్వనుంది.
పోస్టుల వివరాలు
-
సాధారణ పాఠశాలలు (జడ్పీ/మండల పరిషత్/ప్రభుత్వ/మున్సిపల్): 2,111 పోస్టులు (స్కూల్ అసిస్టెంట్లు – 906, ఎస్జీటీ – 1,205)
-
స్పెషల్ ఎడ్యుకేషన్ ఉపాధ్యాయులు: 350 పోస్టులు (స్కూల్ అసిస్టెంట్ SE – 150, ఎస్జీటీ SE – 200)
-
రెసిడెన్షియల్ సొసైటీలు & మోడల్ స్కూళ్లు: 260 పోస్టులు (ప్రిన్సిపల్ – 30, పీజీటీ – 81, టీజీటీ – 113, ఫిజికల్ డైరెక్టర్ – 2, పీఈటీ – 34)
అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ tet2dsc.apcfss.in ద్వారా నవంబర్ 11 నుంచి దరఖాస్తు చేసుకోవాలని పాఠశాల విద్యాశాఖ సూచించింది.
ముఖ్యమైన తేదీలు
-
ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభం: నవంబర్ 11, 2026
-
దరఖాస్తులకు చివరి తేదీ: నవంబర్ 30, 2026
-
మాక్ టెస్టులు అందుబాటు: డిసెంబర్ 5, 2026
-
హాల్ టికెట్ల విడుదల: డిసెంబర్ 14, 2026
-
కంప్యూటర్ ఆధారిత (CBT) పరీక్షలు: డిసెంబర్ 20, 2026 నుంచి జనవరి 13, 2027 వరకు








































