ఆర్ఎక్స్ 100 ఫేమ్ కార్తికేయ హీరోగా, నేహా సోలంకీ హీరోయిన్ గా నటించిన చిత్రం ’90 ML’. ఈ రోజు ఈ చిత్రంలోని ‘నాతో నువ్వుంటే చాలు, కోరుకోను ఇంకేం వరాలు’ సాంగ్ లిరికల్ వీడియోను విడుదల చేసారు. ప్రేమ వ్యవహారంలో అమ్మాయిల నుంచి అబ్బాయిలు ఎలాంటి చిన్న చిన్న విషయాలు కోరుకుంటారో, వాటి ద్వారా ఎలాంటి ఆనందాన్ని పొందుతారో రైటర్ చంద్రబోస్ ఈ పాటలో వివరించారు. అనూప్ రూబెన్స్ సంగీతం వహించగా అద్నాన్ సమీ ఈ పాటకు గాత్రం అందించారు. ఈ సినిమాలో మిగతా పాటలు కూడ త్వరలో మ్యాంగో మ్యూజిక్ ద్వారా విడుదల కానున్నాయి. ఇప్పటికే ఈ చిత్రంలోని ‘వినిపించుకోరు’ సాంగ్ కు తెలుగు సినిమా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. కార్తికేయ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ లో అశోక్ రెడ్డి గుమ్మకొండ నిర్మాతగా శేఖర్ రెడ్డి యెర్రా దర్శకత్వంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంది. నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
‘నాతో నువ్వుంటే చాలు, కోరుకోను ఇంకేం వరాలు’ సాంగ్ లిరికల్ వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇
[subscribe]