మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ థాకరేపై మహారాష్ట్రలోని థానే నగరంలో బహిరంగ ర్యాలీలో కత్తి పట్టుకున్నారనే ఆరోపణలపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు బుధవారం తెలిపారు. ఆయుధాల చట్టంలోని సెక్షన్ 4 మరియు 25 కింద ఠాక్రేపై కేసు నమోదైందని, అలాగే ఆయనతో పాటు పాల్ఘర్ జిల్లా చీఫ్ అవినాష్ జాదవ్ మరియు థానే సిటీ చీఫ్ రవీంద్ర మోర్‌లపై నమోదు చేసినట్లు ఒక అధికారి తెలిపారు. మంగళవారం సాయంత్రం థానే లోని గడ్కరీ చౌక్‌లో జరిగిన ఒక బహిరంగ ర్యాలీలో స్థానిక పార్టీ నాయకులు ఇచ్చిన కత్తిని థాకరే పట్టుకున్నారని, కత్తిని ఝళిపించారని ఆరోపిస్తూ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కాగా రాజ్ థాకరే ప్రస్తుత మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేకు కజిన్ అవుతారు. శివసేన పార్టీ వ్యవస్థాపకుడు, ఉద్ధవ్ తండ్రి స్వర్గీయ బాల్ థాకరేకు వరుసకు మేనల్లుడు అవుతారు. ఒకప్పుడు శివసేన పార్టీలో కీలక పాత్ర పోషించిన రాజ్ థాకరే.. అనంతరం మహారాష్ట్ర నవనిర్మాణ సేన అని వేరుకుంపటి పెట్టుకున్నారు. ఈయన దూకుడు రాజకీయాలకు పెట్టింది పేరు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ