కాపు రిజర్వేషన్స్ పై సీఎం జగన్ కు ముద్రగడ పద్మనాభం లేఖ

All Eyes on Mudragada Padmanabham as Jagan Scraps Kapu Quota, Implement five per cent quota to Kapu community, Kapu leader Mudragada Padmanabham writes to AP CM Jagan, Kapu quota demand back to fore in Andhra, Mango News, Mudragada Padmanabham Writes Letter TO CM Jagan Over 5% Quota To Kapu Community, Mudragada writes to CM Jagan over 5% quota to Kapus

కేంద్ర ప్రభుత్వం అగ్ర వర్ణ పేదలకు ప్రకటించిన 10% రిజర్వేషన్స్ తిరిగి పూర్తిగా వారికే కేటాయిస్తున్నట్టు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. అయితే గత టీడీపీ ప్రభుత్వహయాంలో చంద్రబాబు నాయుడు, కేంద్ర ప్రభుత్వం ఈబీసీలకు ప్రకటించిన 10% రిజర్వేషన్స్ లో 5% కాపులకు కేటాయిస్తూ అసెంబ్లీ లో బిల్లు పెట్టారు. ప్రస్తుత ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆ నిర్ణయంతో ఏకీభవించకుండా పూర్తిగా ఈబీసీలకే 10% రిజర్వేషన్స్ అమలు చేయాలనీ ఆదేశించారు.

అగ్ర వర్ణ పేదల రిజర్వేషన్స్ లో కాపులకు 5% ఇవ్వడం కుదరదంటూ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ , కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం బహిరంగ లేఖ రాసారు. కోర్టులో పలు కేసులు ఉన్నందువలన, కాపులకు రిజర్వేషన్స్ అమలు కుదరదన్నట్లు పత్రికలలో చదివానని, అయితే 5% కాపులకు రిజర్వేషన్స్ వ్యతిరేకిస్తూ ఎక్కడ స్టే ఇచ్చారో అసెంబ్లీలో గాని, మీడియాలో గాని చెప్తే తెలుసుకుంటాం అన్నారు. ఎన్నికల ప్రచారంలో మీరు ఇస్తానన్న 2 వేల కోట్లకు ఆశపడి ఓట్లు వేశామని భావిస్తున్నారా అని ముఖ్యమంత్రి జగన్ ను ప్రశ్నించారు. మా కాపు జాతి బానిసలుగా బతకాలని మీరు అభిప్రాయపడుతున్నారా అంటూ లేఖలో అడిగారు. మెజారిటీ ఎంపీలు గెలిపిస్తే ప్రత్యేక హోదా తెస్తానన్నారని, కేంద్రప్రభుత్వ మంత్రులు ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అంటుంటే ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు.

[subscribe]
[youtube_video videoid=u7kHsDC6i94]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − 2 =