
బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీకి దగ్గరలోని జీఆర్ ఫామ్‌హౌస్‌లో జరిగిన రేవ్ పార్టీ తెలుగు, కన్నడ సినీ,టీవీ ఇండస్ట్రీని ఉలిక్కిపడేలా చేసింది. ఈ జీఆర్ ఫామ్‌హౌస్ హైదరాబాద్‌కు చెందిన గోపాల్ రెడ్డికి చెందినదిగా పోలీసుల విచారణలో తేలింది. పార్టీలో టాలీవుడ్, కన్నడ రెండు పరిశ్రమలకు చెందిన నటీనటులతో పాటు పలు రంగాల సెలబ్రెటీలు హాజరయ్యారు. ప్రస్తుతం వీళ్లంతా బెంగళూరు పోలీసుల అదుపులో ఉన్నారు.తాజాగా ఎఫ్ఐఆర్ లో ఉన్నపేర్లను బెంగళూరు పోలీసులు రిలీజ్ చేశారు.
ఈ రేవ్ పార్టీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే ఎక్కువ ఉన్నారని..అందులోనూ తెలుగు సినీ పరిశ్రమకు చెందినవాళ్లే ఎక్కువ మంది ఉన్నట్లు పోటీసులు చెబుతున్నారు. ముందు టాలీవుడ్‌కు చెందిన హీరో శ్రీకాంత్ పేరు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ పేరు, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పేర్లు ఈ కేసులో మొదటగా వినిపించడంతో కలకలం రేపింది. కానీ వెంటనే వీరంతా సోషల్ మీడియా ద్వారా స్పందించి.. తామసలు ఆ రేవ్ పార్టీకి వెళ్లలేదని , ఆ కల్చర్‌కు మేము దూరం అంటూ వీడియో బైట్లు వదిలారు.
మరోవైపు వైసీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి పేరుతో ఇష్యూ అయిన పాస్ అతికించిన కారు దొరికడంతో..దానిని హ్యాండోవర్ చేసుకున్న బెంగళూరు పోలీసులు, నార్కోటిక్స్ విభాగం అధికారులు ఇప్పటికే దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.అలాగే ఈ రేవ్ పార్టీలో ఎవరెవరు డ్రగ్స్ తీసుకున్నారనేది తెలియడానికి పోలీసులు మెడికల్ టెస్టులు నిర్వహిస్తున్నారు.అయితే సినీ నటి హేమ తాను పార్టీకి వెళ్లలేదన్న వార్తలను మాత్రం బెంగళూరు పోలీసులు ఖండించారు. హేమ పోలీసుల అదుపులోనే ఉందని.. అందరినీ తప్పుదోవ పట్టించడానికే హేమ ప్రయత్నించిందని..ఇంటికి ఫోన్ చేస్తానని మొబైల్ తీసుకుని వీడియోను రిలీజ్ చేసిందని పోలీసులు పేర్కొన్నారు.
క్రికెట్ బుక్కీఅయిన వాసు అనే వ్యక్తి బర్త్ డే వేడుకలకు వీరంతా హాజరైనట్లు బెంగళూరు పోలీసులు చెబుతున్నారు. హైదరాబాద్‌లోని ఫాంహౌస్లపై పోలీసుల నిఘా ఎక్కువగా ఉండటంతో వీరంతా బెంగళూరులో పార్టీ చేసుకున్నారని తెలిపారు. మొదటి రోజు 140 మంది, రెండో రోజు 105 మంది ఈ రేవ్ పార్టీకి హాజరయ్యారు. హేమకు క్లోజ్ ఫ్రెండ్ అయిన చిరంజీవి , అరుణ్, శివాని జైస్వాల్, సందీప్ కొర్రపాటి, రిషి చౌదరి, డింపుల్ చౌదరి, వెంకట్ చౌదరి, బుల్లితెర నటి అషీరాయ్ ఈ పార్టీకి హాజరయ్యారని.. వారి పేర్లను ఎఫ్ఐఆర్లో కూడా నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు..
టాలీవుడ్లో బెంగళూరు రేవ్ పార్టీ ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో నటి హేమ, ఆషీరాయ్, వాసు డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు.ఇక డ్రగ్స్ కేసులో పాజిటివ్ రావడంపై … ఏం చేస్తారో చేసుకోండి అని నటి హేమ అన్నారు. సరైన సమయం వచ్చినప్పుడే దీనిపై మాట్లాడతానన్నారు. మరోవైపు బెంగళూరు పోలీసులకు హేమ.. తన పేరును కష్ణవేణి అని చెప్పినట్లు తెలుస్తోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY