సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్ ‌పోస్ట్‌మార్టం పూర్తి, సాయంత్రం అంత్యక్రియలు

#SushantSinghRajput, Actor Sushant Singh Rajput, Actor Sushant Singh Rajput Suicide, Ankita Lokhande, Bollywood Actor Sushant Singh Rajput, Disha Salian Death, sushant singh rajput, Sushant Singh Rajput Demise, Sushant Singh Rajput Last Rites, Sushant Singh Rajput Post-mortem

బాలీవుడ్‌ ప్రముఖ యువ కథానాయకుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య యావత్ భారతీయ సినీ ప్రముఖుల్ని, అభిమానుల్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. కొన్ని సినిమాలతోనే నటుడిగా గొప్ప పేరు సంపాదించి, మంచి భవిష్యత్ కలిగిఉన్న సుశాంత్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో బాలీవుడ్ ఒక్కసారిగా షాక్ కు గురైంది. కాగా ముంబయిలోని కూపర్‌ మున్సిపల్‌ జనరల్‌ ఆసుపత్రిలో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్ మృతదేశానికి ‌పోస్ట్‌మార్టం నిర్వహించారు. అనంతరం వైద్యులు పోస్ట్‌మార్టం ప్రాథ‌మిక‌ నివేదిక‌ను విడుదల చేస్తూ ఆయనది ఆత్మహత్యేనని ధ్రువీకరించారు. ఉరి వేసుకోవడం వలనే సుశాంత్ ఊపిరాడక‌ మృతి చెందినట్లుగా పోస్ట్‌మార్టం రిపోర్ట్ లో పేర్కొన్నారు. అయితే అవ‌య‌వాల్లో ఏవైనా విష‌పూరితాలు ఉన్నాయో లేదో కెమికల్ ఎనాలిసిస్ చేసేందుకు ఆయన సాంపిల్స్ ను జేజే ఆసుప‌త్రికి త‌ర‌లించినట్టుగా తెలుస్తుంది.

సుశాంత్‌ కుటుంబ సభ్యులు పట్నా నుంచి ముంబయి చేరుకున్నారు. సోమవారం సాయంత్రం సుశాంత్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మరోవైపు సుశాంత్‌ మృతదేహం ఫొటోల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయొద్దని మహారాష్ట్ర సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఒకవేళ ఇప్పటికే పోస్ట్ చేసినా వెంటనే డిలీట్ చేయాలనీ సూచించారు. అలాగే సుశాంత్‌ మాజీ మేనేజర్‌ దిశా సెలైన్ వారం రోజుల క్రితమే ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన జరిగిన కొన్ని రోజులకే సుశాంత్ కూడా ఆత్మహత్య చేసుకుని మరణించడంతో అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో పోలీసులు ఆ కోణంలో కూడా దర్యాప్తు చేపడుతున్నట్టు సమాచారం.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here