ఫోన్ ట్యాపింగ్ కేసు.. సిట్ పిలిస్తే విచారణకు వెళ్తా – తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత

Kalvakuntla Kavitha Defends KCR in Phone Tapping Case, Slams Congress Govt

తెలంగాణ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు తీవ్రతరమైన వేళ, బీఆర్ఎస్ మాజీ నాయకురాలు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. తన తండ్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా సిట్ విచారణకు హాజరైన నేపథ్యంలో.. తాజాగా ఆమె మీడియాతో మాట్లాడారు. కేసీఆర్‌పై వస్తున్న ఆరోపణలను ఆమె కొట్టిపారేయడమే కాకుండా, ఈ మొత్తం వ్యవహారం వెనుక రాజకీయ కుట్ర ఉందని ఆరోపించారు.

ముఖ్యాంశాలు:

విచారణకు సిద్ధమన్న కవిత: ఫోన్ ట్యాపింగ్ కేసులో తాను కూడా బాధితురాలినేనని, ఒకవేళ ఈ కేసులో నన్ను విచారించాలని పోలీసులు భావిస్తే, నిరభ్యంతరంగా పిలవవచ్చు. సిట్ పిలిస్తే నేను విచారణకు వెళ్తాను, నా దగ్గరున్న సమాచారాన్ని పంచుకుంటాను, అని ఆమె ధీమాగా చెప్పారు. నాతో పాటు నా భర్త ఫోన్లను కూడా ట్యాప్ చేశారని మాకు అనుమానాలున్నాయి. అని కీలక వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శల వర్షం: ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై కవిత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైన రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసును వాడుకుంటోందని ఆరోపించారు. కేవలం రాజకీయ కక్ష సాధింపు కోసమే తమ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకున్నారని మండిపడ్డారు. అభివృద్ధిని గాలికొదిలేసి, ప్రతిపక్ష నేతలను ఇబ్బంది పెట్టడమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని విమర్శించారు.

దర్యాప్తు పారదర్శకతపై ప్రశ్నలు: ప్రస్తుతం జరుగుతున్న విచారణ నిష్పక్షపాతంగా సాగడం లేదని కవిత అభిప్రాయపడ్డారు. అధికారులను ఒత్తిడికి గురిచేసి తమకు అనుకూలమైన వాంగ్మూలాలు ఇప్పిస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ లాంటి సీనియర్ నేతను విచారణ పేరుతో ఇబ్బంది పెట్టడం తెలంగాణ సమాజం గమనిస్తోందని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ అంశంలో విచారణ ఫెయిర్‌గా జరగాలని డిమాండ్ చేశారు.

కేటీఆర్ వైఖరిపై విమర్శలు: సిట్ విచారణపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాటలు నియంతృత్వం, రాచరికపు పోకడలకు నిదర్శనమని కవిత మండిపడ్డారు. చట్టాలను ప్రతి ఒక్కరూ గౌరవించాలి. దర్యాప్తు సంస్థలకు సహకరించాలి అని హితబోధ చేశారు. అలాగే మాజీ మంత్రి హరీశ్‌ రావు సీఎం రేవంత్‌ రెడ్డితో కుమ్మక్కై నాటకాలాడుతున్నారని ఆమె ఫైర్ అయ్యారు.

వితను విచారిస్తారా?

కవిత చేసిన ఈ వ్యాఖ్యలు బీఆర్ఎస్ శ్రేణుల్లో కొత్త చర్చకు దారితీశాయి. విచారణకు తాను సిద్ధమని చెప్పడం ద్వారా ఆమె నైతిక విజయాన్ని సాధించే ప్రయత్నం చేశారు. అటు కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఆధారాలు లేకుండా ఎవరినీ విచారించడం లేదని వాదిస్తోంది.

ఈ కేసులో కవితను కూడా విచారిస్తారా లేదా అన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. చట్టం ముందు అందరూ సమానమేనని, విచారణకు సహకరించడం తన బాధ్యతని కవిత పేర్కొన్నారు. మొత్తానికి, ఫోన్ ట్యాపింగ్ కేసు కేవలం నేర విచారణగానే కాకుండా, తెలంగాణ రాజకీయ భవిష్యత్తును నిర్ణయించే స్థాయికి చేరుకుంది.

కాగా, త్వరలో జరుగనున్న మునిసిపల్ ఎన్నికల్లో తెలంగాణ జాగృతి తరఫున మంచి అభ్యర్థులు ఫార్వర్డ్ బ్లాక్ గుర్తుపై పోటీ చేస్తున్నారని కవిత చెప్పడం విశేషం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here