రేవంత్ వార‌సుడెవ‌రో..

Malkajgiri, Revanth reddy, Congress, Lok sabha elections, Hyderabad, Malkajgiri Assembly, TPCC, Minister for Finance and Health, Revanth Reddy News And Live Updates, Telangna Congress Party, Telangana CM Revanth Reddy Live Updates,Telangana CM Party,Telangana State CM Revanth Reddy, Mango News, Mango News Telugu
Malkajgiri, Revanth reddy, Congress, Lok sabha elections

లోక్ స‌భ ఎన్నిక‌ల్లో అది హాట్ సీట్ గా మారిపోయింది. అంద‌రి క‌న్నూదానిపైనే. కీల‌క నేత‌లు.. సీనియ‌ర్లు.. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీచేసి ఓడిపోయిన వారూ.. అంద‌రూ ఆ సీటు కోస‌మే పోటీ. ఎలాగైనా పొందాల‌ని బిగ్ బాస్‌ల చుట్టూ ప్ర‌ద‌క్షిణ‌లు.. ఇదంతా మ‌ల్కాజిగిరి లోక్‌స‌భ‌లో పోటీ చేసేందుకు.అక్కడి నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తూనే  రేవంత్‌రెడ్డి  అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలవడమే కాక ఏకంగా సీఎం అయ్యారు. దీంతో  ఆ నియోజకవర్గంలో ఆయన తర్వాత ప్రాతినిధ్యం వహించే వారసుడెవరన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పార్టీలతో సంబంధం లేకుండా అన్ని పార్టీల నుంచీ ఆ సీటుకు పోటీ పడుతున్న వారు పెరిగిపోతున్నారు. అక్కడ నుంచి గెలిస్తే మున్ముందు మరింత ఉన్నతస్థానాల కెదగవచ్చునన్న సెంటిమెంట్‌తోనూ కొందరు ఆ సీటుపై కన్నేశారు. గతంలో  టీడీపీ నుంచి అక్కడ ఎంపీ అయిన మల్లారెడ్డి.. బీఆర్‌ఎస్‌ నుంచి  ఎమ్మెల్యే అయ్యాక మంత్రి పదవి పొందడం తెలిసిందే.

లోక్‌సభ ఎన్నికలకు ఎక్కువ సమయం లేకపోవడంతో ఇక ఆసీటుకు ఉప ఎన్నిక నిర్వ‌హించ‌లేదు. ఇప్పుడు మల్కాజిగిరికి బోలెడు డిమాండ్‌ ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ.. ఈ పార్టీ అని కాకుండా అన్ని పార్టీల నుంచీ  పోటీ చేయాలనుకుంటున్న ఆశావహుల సంఖ్య పెరిగిపోతోంది. గతంలో ఇతర ప్రాంతాల నుంచి ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన వారు సైతం పలువురు ఇప్పుడు మల్కాజిగిరి నుంచి రంగంలో దిగేందుకు ఉత్సాహం చూపుతున్నారు. బీజేపీ నుంచి ఈటల రాజేందర్‌తో పాటు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు మురళీధర్‌రావు,  మేడ్చల్‌ అర్బన్‌ జిల్లా అధ్యక్షుడు పన్నాల హరీశ్‌రెడ్డి, మాజీ ఎంపీ చాడ సురేష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్‌, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావుతో పాటు ఢిల్లీ ప‌బ్లిక్ స్కూల్ చైర్మ‌న్ మ‌ల్క కొముర‌య్య మరికొందరు నయా నేతలు కూడా ఈ సీటు కోసం  ఆశ పడుతున్నట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లలోనూ ఈసీటుకు  పోటీ భారీగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో మహేశ్వరం నుంచి పోటీ చేసి ఓడిపోయిన కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి, మెదక్‌ నుంచి ఓటమిపాలైన మైనంపల్లి హన్మంతరావు, కూక‌ట్‌ప‌ల్లి నుంచి పోటీ చేసి ఓడిపోయిన బండి ర‌మేశ్‌, తో పాటు టిక్కెట్‌ దక్కని సింగిరెడ్డి హరివర్ధన్‌రెడ్డి, మాజీ ఎంపీ సర్వే సత్యనారాయణ తదితరులు  ఇక్కడి నుంచి పోటీచేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు  తెలుస్తోంది. బీఆర్‌ఎస్‌ నుంచి అసెంబ్లీ టిక్కెట్లు దక్కని బేతి సుభాష్‌రెడ్డి, బొంతురామ్మోహన్‌,ముద్దగోని రామ్మోహన్‌లతోపాటు శంభీపూర్‌ రాజు తదితరులు ఆశపడుతున్నారు. గత ఎన్నికల్లో ఎంపీగా ఓడిపోయిన మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖరరెడ్డి ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడంతో ఈసారి ఎంపీ టిక్కెట్‌ ఎవరికిస్తారనేది ఆసక్తికరంగా మారింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 − 2 =