కోవిడ్‌ చికిత్సకు అధిక రేట్లు వసూలు చేయడంపై సీఎం జగన్ ఆగ్రహం

Andhra Pradesh, AP CM YS Jagan, AP CM YS Jagan on Spandana Program, AP CM YS Jagan Video Conference with Collectors, Spandana Program, spandana program details, spandana program in ap, Y.S. Jagan Mohan Reddy, YS Jagan Video Conference, YS Jagan Video Conference with Collectors on Spandana Program

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్ ‌రెడ్డి ఆగస్టు 25, మంగళవారం నాడు స్పందన కార్యక్రమంలో భాగంగా అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, రాష్ట్రంలో కోవిడ్‌ ఆస్పత్రుల నిర్వహణపై కలెక్టర్లు దృష్టి పెట్టాలని సూచించారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే కోవిడ్‌ చికిత్సకు ఆసుపత్రుల్లో అధికంగా రేట్లు వసూలు చేస్తున్నారని వస్తున్న ఫిర్యాదులు పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. కోవిడ్‌ బాధితుల నుండి ఎక్కువ డబ్బు వసూలు చేస్తే కచ్చితంగా చర్యలు తీసుకుంటామని సీఎం వైఎస్ జగన్ హెచ్చరించారు.

అదేవిధంగా కోవిడ్ ఆసుపత్రుల్లో బాధితులకు అరగంటలోగా బెడ్ ఇవ్వాల్సిన బాధ్యత కలెక్టర్లదేనని సీఎం స్పష్టం చేశారు. 104, 14410 కాల్‌ సెంటర్లకు వచ్చే కాల్స్ కు ప్రాధాన్యత ఇచ్చి, వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం గోదావరి వరదలపై సమీక్షించారు. పంట నష్టంపై అంచనాలను సెప్టెంబర్ 7 లోగా రూపొందించాలని అధికారులను సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 + 14 =