ఐపీఎల్‌ లో పాల్గోనే క్రికెటర్స్ లో కనీసం 50 మందికి డోప్ టెస్టులు

IPL, IPL 2020, IPL 2020 Latest Updates, IPL 2020 schedule, NADA, NADA Officials to Conduct Doping Tests, national anti doping agency Latest News, National Anti Doping Agency News, National Anti-Doping Agency

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)-2020‌ యూఏఈ లో జరగనున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకు ఐపీఎల్ 13 వ సీజన్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ లో పాల్గొనే క్రికెటర్లకు డోపింగ్‌ పరీక్షలు నిర్వహించేందుకు నేషనల్ యాంటీ-డోపింగ్ ఏజెన్సీ (నాడా) సిద్దమవుతుంది. ముగ్గురు ఉన్నత స్థాయి అధికారులు, ఆరుగురు డోప్ కంట్రోల్ ఆఫీసర్స్ (డిసిఓ) లు నమూనాల సేకరణ కోసం యూఏఈ వెళ్లనున్నారు. టోర్నీ జరిగే సమయంలో మూడు విడతల్లో కనీసం 50 మంది క్రికెటర్స్ కు డోపింగ్‌ పరీక్షలు నిర్వహించాలని నాడా నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. యూఏఈ లో మ్యాచులు జరిగే దుబాయ్‌, షార్జా, అబుదాబి స్టేడియాలతో పాటుగా ఐసీసీ అకాడమీ, జాయెద్‌ క్రికెట్‌ స్టేడియాల్లో కూడా మొత్తం డోప్ కంట్రోల్ స్టేషన్స్ (డీసీఎస్‌) ఏర్పాటు చేయనున్నారు. మరోవైపు ఐపీఎల్ లో పాల్గొనే జట్లు ఇప్పటికే యూఏఈ చేరుకున్న సంగతి తెలిసిందే.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here