నేవీ డే వేడుకల్లో పాల్గొన్న ఏపీ సీఎం వైఎస్ జగన్

AP CM YS Jagan Participated In Navy Day Celebrations, Ap Political Live Updates 2019, Ap Political News, AP Political Updates, AP Political Updates 2019, Mango News Telugu, Navy Day Celebrations 2019, Navy Day Celebrations In Visakhapatnam

విశాఖపట్నం సాగరతీరంలో డిసెంబర్ 4, బుధవారం నాడు నేవీ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఆర్కే బీచ్‌లో జరిగిన ఈ నేవీ డే వేడుకలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై నేవీ విన్యాసాలను తిలకించారు. ఈ సందర్భంగా నేవీ అధికారులుకు సీఎం వైఎస్ జగన్ అభినందనలు తెలియజేశారు. 1971లో పాకిస్తాన్‌ తో జరిగిన యుద్దంలో గెలుపు సాధించడంలో తూర్పు నావికా దళం ముఖ్య భూమికను పోషించింది. యుద్ధంలో పాకిస్తాన్‌పై గెలుపుకు గుర్తుగా భారత నావికాదళం డిసెంబర్‌ 4న నేవీ డే ను జరుపుకుంటుంది. తూర్పు నావికా దళం ప్రారంభమై 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఈ రోజు ఆర్‌కే బీచ్‌లో నేవీ డే వేడుకలను అద్భుతరీతిలో నిర్వహించారు. నేవీ విన్యాసాలు చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. నేవీ విభాగం గగనతలంలో చేసిన విన్యాసాలు ప్రజలను అబ్బురపరిచాయి. తూర్పు నావికా దళాధిపతి అతుల్ కుమార్ జైన్ ఈ వేడుకల్లో పాల్గొన్నారు.

[subscribe]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − 16 =