ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ లో కోహ్లీ నెంబర్ 1

2019 Latest Sport News, 2019 Latest Sport News And Headlines, ICC Test rankings, ICC Test Rankings Updates, latest sports news, latest sports news 2019, Mango News Telugu, sports news, Virat Kohli Latest News, Virat Kohli No.1 Position In ICC Test Rankings

అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) తాజాగా విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్ లో భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ మళ్ళీ అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఇటీవలే బంగ్లాదేశ్‌తో జరిగిన డే/నైట్‌ టెస్టులో డబుల్ సెంచరీ సాధించిన కోహ్లి 928 పాయింట్లతో నెంబర్ 1 స్థానంలో నిలిచి ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్‌ స్టీవ్‌ స్మిత్‌ ను రెండో స్థానానికి నెట్టేశాడు. పాకిస్తాన్ తో జరిగిన టెస్టు సిరీస్ లో స్టీవ్‌ స్మిత్‌ విఫలం అవ్వడంతో 931 పాయింట్స్ నుంచి 923 తగ్గి రెండో స్థానంలో నిలిచాడు. కొంతకాలం నిషేధం అనంతరం యాషెస్ సిరీస్ లో అద్భుతంగా రాణించిన స్టీవ్‌ స్మిత్‌ కోహ్లీని వెనక్కినెట్టి టెస్టుల్లోఅగ్రస్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్ళీ కోహ్లీ తిరిగి తన స్థానాన్ని దక్కించుకున్నాడు. అయితే ఇద్దరి మధ్య 5 పాయింట్స్ మాత్రమే తేడా ఉండడంతో ఐసీసీ ర్యాంకింగ్స్ లో వీరిద్దరి పోరు కొనసాగేలానే ఉంది.

మరో వైపు పాకిస్తాన్ తో జరిగిన సిరీస్ లో ట్రిపుల్‌ సెంచరీ సాధించిన వార్నర్‌ 12 స్థానాలు ఎగబాకి ఐదో ర్యాంకు సాధించాడు. అలాగే ఈ సిరీస్ లో వరుస సెంచరీలు చేసిన మరో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్‌ మార్నస్‌ లబుషేన్‌ మొదటిసారిగా టాప్‌-10లోకి అడుగుపెట్టి ఎనిమిదో ర్యాంకు సాధించాడు. ఇక భారత్ నుంచి చటేశ్వర్ పుజారా తన నాలుగో స్థానాన్ని నిలుపుకోగా, అజింక్య రహానె ఒక స్థానం తగ్గి ఆరోర్యాంకులో నిలిచాడు. ఇక ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ బౌలింగ్ విభాగంలో భారత్ పేస్ బౌలర్ జస్‌ప్రీత్‌ బుమ్రా బౌలింగ్‌ ఐదో స్థానంలో ఉండగా, స్పిన్నర్ రవిచంద్రన్‌ అశ్విన్‌ తొమ్మిదో స్థానంలో, మహమ్మద్ షమీ పదవ స్థానంలో నిలిచారు. ఆల్ రౌండర్ విభాగంలో రవీంద్ర జడేజా రెండో ర్యాంకులో, రవిచంద్రన్‌ అశ్విన్‌ ఐదో ర్యాంకులో కొనసాగుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × three =