పురందేశ్వరి అలక నిజమేనా?

Is Purandeshwari Alaka Real?, Purandeshwari Alaka, AP BJP Chief Purendeswari Angry, TDP , Chandrababu , Vizag And Hindupuram Seats ,TDP, YCP, Janasena, BJP, CM Jagan, Andhra Pradesh, Political News, Mango News, Mango News Telugu
ap bjp chief Purendeswari angry, tdp , chandrababu , vizag and hindupuram seats ,TDP, YCP, Janasena, BJP

పొత్తులో అలకలు సాధారణమే. ఏ రెండు పార్టీలు పొత్తు పెట్టుకున్నా కొందరిలో ‘అసంతృప్తి‘ చిన్న విషయమే. అయితే ఈ అలకలు, అసంతృప్తులు మొత్తం కూటమిని ప్రభావితం చేయకూడదు. ముఖ్యంగా కేడర్‌ను కన్ఫ్యూజన్‌లో పడేయకూడదు. అలా చేస్తే మొదటికే మోసం వస్తుంది. టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తుతో అదే జరుగుతుందానన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. నిజానికి జనసేన-బీజేపీ నాలుగున్నరేళ్ల నుంచే పొత్తులో ఉన్నాయి. స్కిల్‌ స్కామ్‌ కేసులో చంద్రబాబు అరెస్ట్ తర్వాత పవన్‌ కల్యాణ్‌ టీడీపీకి మద్దతు ప్రకటించారు. ఈ విషయంలో బీజేపీ చాలాకాలం వ్యూహాత్మక మౌనం పాటించింది. బీజేపీ హైకమాండ్‌తో చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ అనేక సంప్రదింపుల తర్వాత ఎట్టకేళ్లకు మోదీ పార్టీ పొత్తుకు పచ్చజెండా ఊపింది. అయితే ఈ పొత్తులో మొదటి నుంచి అలకలు, లుకలుకలే. చంద్రబాబు ఇష్టారీతిన నిర్ణయాలు తీసుకుంటారని మొదట్లోనే పవన్‌ ఫైర్ అయ్యారు. చంద్రబాబు రెండు సీట్లు ప్రకటిస్తే తాను రెండు సీట్లు ప్రకటిస్తాని బహిరంగంగా ఎదురుదాడికి దిగారు. తర్వాత కొన్నాళ్లకు ఈ ఇద్దరి మధ్య జరిగిన కోల్డ్‌ వార్‌ ఓ సర్థుబాటు దారితీసింది. అయితే ఇంతలోనే ఏపీ బీజేపీ చీఫ్‌ పురందేశ్వరి అలిగినట్టుగా తెలుస్తోంది.

పొత్తులో భాగంగా బీజేపీ 10 అసెంబ్లీ, 6 ఎంపీ స్థానాల్లో పోటి చేస్తోంది. ఇందులో వైజాగ్‌, హిందూపురం పార్లమెంట్‌ నియోజకవర్గాల విషయంలో టీడీపీ తీసుకున్న నిర్ణయం పురందేశ్వరి అలకకు కారణంగా తెలుస్తోంది. నిజానికి విశాఖ పార్లమెంట్ స్థానం నుంచి ఏపీ బీజేపీలో అంతర్గత యుద్ధం నడిచింది. జీవీఎల్‌, పురందేశ్వరి ఇద్దరూ వైజాగ్‌ ఎంపీ అభ్యర్థిగా పోటి చేయాలని తలబడ్డారు. అయితే టీడీపీ మాత్రం తన క్యాండిడెట్‌కు వైజాగ్‌ ఎంపీ టికెట్‌ను ఇచ్చింది. ఇది ఏపీ బీజేపీని ఆగ్రహానికి గురి చేసిందని కథనాలు వస్తున్నాయి. ముఖ్యంగా పురందేశ్వరి ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారని తెలుస్తోంది. పొత్తు ధర్మానికి చంద్రబాబు తూట్లు పొడిచారని పురందేశ్వరి తన పార్టీ నేతల వద్ద ఆగ్రహం వ్యక్తం చేశారన్న వార్తలు వినిపిస్తున్నాయి.

కేడర్‌లో కన్ఫ్యూజన్:అటు హిందూపురం నుంచి పరిపూర్ణనంద స్వామిని బరిలోకి దింపాలని బీజేపీ భావించింది. అయితే ఇక్కడ కూడా చంద్రబాబు తన పార్టీ అభ్యర్థినే నిలబెట్టాలాని నిర్ణయించుకున్నారు. ఈ విషయంలో కూడా ఏపీ బీజేపీ సీరియస్‌గా ఉందని సమాచారం. తమకు చెప్పకుండా టీడీపీ నిర్ణయాలు తీసుకోవడం పొత్తు ధర్మం అనిపించుకోదని ఏపీ బీజేపీ అలిగినట్టుగా తెలుస్తోంది. ఈ రెండు స్థానాలపై ఏపీ బీజేపీ ఎన్నో ఆశలు పెట్టుకుంది. మరోవైపు కూటమికి చెందిన మూడు పార్టీల కేడర్‌లో జరుగుతున్న పరిణామాలు అయోమయానికి గురిచేస్తున్నాయి. యూనిటీగా లేకుండా కూటమిపై నేతలే ఒకరినొకరు నిందించుకోవడం కేడర్‌ను కన్ఫూజన్‌లో పడేసింది. ఈ మొత్తం పరిణామాలు జగన్‌కు మేలు చేసే విధంగా ఉండకూదన్నది కేడర్‌ అభిప్రాయం. మరి చూడాలి అలకలు పక్కన పెట్టి అదే సమయంలో పొత్తు ధర్మాన్ని పాటిస్తూ ఈ త్రి-కూటమి పార్టీలు ఇకపై ఎలా ముందుకు వెళ్తాయో..!

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen + fifteen =