సెప్టెంబర్ 6న శ్రీకాకుళంలో సీఎం జగన్ పర్యటన

AP CM YS Jagan To Visit Srikakulam On September 6th,AP CM YS Jagan To Visit Srikakulam,CM YS Jagan To Visit Srikakulam On September 6th,YS Jagan To Visit Srikakulam On September 6th,YS Jagan To Visit Srikakulam,CM YS Jagan To Visit Srikakulam,AP Political Live Updates 2019, AP Political News, AP Political Updates, AP Political Updates 2019,Mango News Telugu

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి సెప్టెంబర్ 6 శుక్రవారం నాడు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. శుక్రవారం మొదటగా విశాఖపట్నం చేరుకొని అక్కడినుంచి నేరుగా శ్రీకాకుళం జిల్లా పలాసకు వెళ్తారు. ఉదయం 11 గంటలకు కాశీబుగ్గ చేరుకొని, అక్కడి రైల్వే గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన సభలో పాల్గొని, పలు ప్రభుత్వ పధకాలను ప్రారంభించనున్నారు. ఆ తరువాత ఉద్దానం ప్రాంత ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరు సరఫరా చేసే ప్రాజెక్టుకు, వజ్రపు కొత్తూరు మండలం మంచినీళ్ళపేటలో మత్స్యకారుల కోసం నిర్మించిన జెట్టీ నిర్మాణానికి, పలాసలో నిర్మించనున్న 200 పడకల కిడ్నీ సూపర్ స్పెషలిటీ ఆసుపత్రి మరియు రీసెర్చ్ సెంటర్ కు ముఖ్యమంత్రి జగన్ శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం పైలట్ ప్రాజెక్టు కింద శ్రీకాకుళం జిల్లాలో ఇంటింటికి నాణ్యమైన బియ్యం పంపిణి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.

మధ్యాహ్నం రెండు గంటలకు ఎచ్చెర్లకు చేరుకుంటారు. అక్కడ ఎస్ఎం పురం ట్రిపుల్ ఐటీలో తరగతి గదులను, హాస్టల్ బ్లాక్ లను ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ ప్రారంభిస్తారు. ఆ తరువాత విద్యార్థులతో ముఖాముఖీ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం జిల్లాలోని సింగుపురం ప్రాంతంలో నిర్మించిన అక్షయపాత్ర ఫౌండేషన్ సెంట్రలైజ్డ్ కిచెన్ ను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి విశాఖకు చేరుకొని, తాడేపల్లికి తిరుగు పయనమవుతారు.

 

[subscribe]
[youtube_video videoid=fWZKLyqxdho]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − five =