వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుపై మాజీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు

AP Ex Minister Kodali Nani Serious Comments on TDP Chief, TDP Chief Chandrababu Naidu, Nara Lokesh, Mango News, Mango News Telugu,Kodali Nani Serious Comments on Chandrababu Naidu, Kodali Nani Serious Comments on Nara Lokesh, AP Ex Minister Kodali Nani, Kodali Nani Latest News, YCP Vs TDP, Kodali Nani Vs Chandrababu Naidu, Andhra Pradesh Breaking News

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకి సంబంధించి అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇటీవలే తెలంగాణకు బదిలీ చేయబడిన ఈ కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దర్యాప్తు వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలో ఏపీలోని అధికార పార్టీకి చెందిన కడప ఎంపీ, వివేకా బంధువు వైఎస్ అవినాష్ రెడ్డి సహా పలువురు ప్రభుత్వ పెద్దల సన్నిహితులను విచారిస్తోంది. ఈ క్రమంలో ప్రతిపక్ష టీడీపీ నేతలు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై మరియు పార్టీ పెద్దలపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆరోపణలు చేస్తున్నారు. దీంతో అధికార పక్షం టీడీపీ అధినేత టార్గెట్‌గా ఎదురుదాడి చేస్తోంది.

ఈ నేపథ్యంలోనే తాజాగా వైసీపీ నేత, ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని స్పందించారు. దీనిపై శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, యువనేత నారా లోకేష్‌లపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా కొడాలి నాని ఏమన్నారంటే.. ఈ కేసుతో వైసీపీకి ఏం సంబంధం? వివేకా హత్య జరిగిన సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్నది చంద్రబాబు నాయుడు కదా.. ముందు ఆయన ఫోన్ కాల్స్ పైన సీబీఐ విచారణ జరపాలి. అలాగే నాడు డీజీపీగా ఉన్న అధికారిపైన, స్థానిక టీడీపీ నేతల ఫోన్ కాల్స్ పైనా విచారణ చేయాలి. సీఎం జగన్ మోహన్ రెడ్డితో మాట్లాడాలంటే అక్కడి సిబ్బందికే కాల్ చేయాలి, అక్కడ పనిచేసే నవీన్ అనే వ్యక్తికి ఎంపీ అవినాష్ రెడ్డి ఫోన్ చేశారని వివాదం చేయడంలో అర్ధం లేదు. ఇక లోకేష్ రోజుకు కనీసం 10 కి.మీ కూడా పాదయాత్ర చేయడం లేదు. ఆయన వ్యక్తిగత సిబ్బంది, టీడీపీ నేతలు తప్ప యాత్రలో జనాలు కనిపించడం లేదు. లోకేష్‌కు పోటీ లేకుండా చేసేందుకే నందమూరి వారసులను పార్టీలో ఎదగకుండా చేస్తున్నారు’ అని సంచలన వ్యాఖ్యలు చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × four =