ఫిబ్రవరి 6న ములుగు నుండి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ‘హాత్ సే హాత్ జోడో’ యాత్ర,

TPCC President Revanth Reddy Start Haath Se Haath Jodo Yatra from Mulugu, Mango News, Mango News Telugu, TPCC President Revanth Reddy, Start Haath Se Haath Jodo Yatra, Revanth Reddy Haath Se Haath Jodo Yatra, Haath Se Haath Jodo Yatra Details,Revanth Reddy from Mulugu,TPCC President Revanth Reddy Latest News, TPCC Chief Revanth Yatra, Revanth Reddy Announces Hath Se Hath Jodo Yatra

కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ నేతృత్వంలో జరిగిన ‘భారత్ జోడో యాత్ర’ జనవరి 30వ తేదీన జమ్మూకశ్మీర్ లోని శ్రీనగర్‌లో ముగిసిన విషయం తెలిసిందే. రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర సందేశాన్ని సామాన్యులకు చేరేలా ప్రచారం చేసేందుకు జనవరి 26 నుంచి హాత్ సే హాత్ జోడో అభియాన్ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రారంభించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హత్ సే హత్ జోడో పాదయాత్ర ఫిబ్రవరి 6, సోమవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమాన్ని సమ్మక్క-సారలమ్మ స్ఫూర్తితో నుంచి ములుగు జిల్లా నుండి ప్రారంభిస్తున్నట్టుగా రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ హత్ సే హత్ జోడో పాదయాత్రలో రేవంత్ రెడ్డితో పాటుగా ముఖ్య తెలంగాణ కాంగ్రెస్ నాయకులు పాల్గొననున్నారు. ఫిబ్రవరి 6న ములుగులో జరిగే ప్రారంభసభలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మానిక్ రావ్ ఠాక్రే కూడా పాల్గొననున్నారు.

ఇటీవల ఈ యాత్రపై రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, “రాహుల్ గాంధీ జనవరి 30న భారత్ జోడో యాత్రను విజయవంతంగా ముగించారు. ఆ స్ఫూర్తిని, ఆ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు హాత్ సే హాత్ జోడో యాత్రను చేపట్టాలని జాతీయ కాంగ్రెస్ ఆదేశాలు ఇచ్చింది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ హాత్ సే హాత్ జోడో కార్యక్రమాన్ని ఫిబ్రవరి 6వ తేదీ నుంచి ప్రారంభిస్తుంది. ములుగు శాసనసభ నియోజకవర్గంలో ఉన్న సమ్మక్క-సారక్క జాతర నుంచి హాత్ సే హాత్ జోడో కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. అక్కడి స్థానిక శాసనసభ్యురాలు సీతక్క నేతృత్వంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ యాత్రలో వివిధ సందర్భాల్లో పలువురు జాతీయస్థాయి నాయకులు కూడా పాల్గొంటారు. హత్ సే హత్‌జోడో యాత్ర మొదటి విడత 60 రోజులపాటు కొనసాగుతుంది. మొదటి విడతలో దాదాపుగా 40 నుంచి 50 నియోజకవర్గాలలో ఈ యాత్ర చేయాలనుకుంటున్నాం. ఆ తరవాత ఇంకా కొనసాగించే విషయం పార్టీలో చర్చించుకుని ముందుకువెళ్ళడం జరుగుతుంది” అని పేర్కొన్నారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × one =